Tirupathi Rao
సాధారణంగా గుండెపోటు వచ్చిన వాళ్లకు కృత్రిమంగా శ్వాసఆడేలా చేసి బతికించే ప్రయత్నం చేయడాన్ని సీపీఆర్ అంటారు. అయితే దానిని కొన్నిసార్లు జంతువులకు కూడా చేసి ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. కానీ, ఎప్పుడన్నా పాముకు సీపీఆర్ చేయడం మీరు చూశారా?
సాధారణంగా గుండెపోటు వచ్చిన వాళ్లకు కృత్రిమంగా శ్వాసఆడేలా చేసి బతికించే ప్రయత్నం చేయడాన్ని సీపీఆర్ అంటారు. అయితే దానిని కొన్నిసార్లు జంతువులకు కూడా చేసి ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. కానీ, ఎప్పుడన్నా పాముకు సీపీఆర్ చేయడం మీరు చూశారా?
Tirupathi Rao
ఈ మధ్యకాలంలో సీపీఆర్ అనే పదం బాగా వింటున్నాం. ఎందుకంటే మారిన జీవన విధానం వల్ల మనుషులకు గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కూడా వస్తోంది. అయితే ఎవరైనా గుండెపోటుకు గురైనప్పుడు.. సీపీఆర్ చేస్తే వారి ప్రాణాలు కాపాడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవలకాలంలో సీపీఆర్ కి సంబంధించి ప్రజల్లో అవగాహన కూడా పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే సీపీఆర్ అంటే మనుషులకు చేయడం వరకు అందరికీ తెలుసు. కానీ, ఈ పోలీసు ఏకంగా పాముకు సీపీఆర్ చేశారు.
సోషల్ మీడియాలో మీరు తరచూ రకరకాల వీడియోలు చూస్తూ ఉంటారు. వాటిలో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. ఇంకొన్ని మాత్రం అబ్బురపరుస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వీడియోలు చూస్తే నెటిజన్స్ వావ్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఉడతలు, కోతులకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపడటం కూడా చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వీడియోలో ఒక పోలీసాయన ఏకంగా పాముకు సీపీఆర్ చేశారు. పామును నోట్లో పెట్టుకుని గాలి ఊది దాని ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించాడు. ఈయన చేసిన ఈ సాహసాన్ని చూసిన నెటిజనులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంటి సార్ మీ ధైర్యం అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని నర్మదాపురంలో చోటుచేసుకుంది. సెమ్రీ హర్ చంద్ లోని ఓ కాలనీలో పాము ఉన్నట్లు ఫోన్ వచ్చింది. వెంటనే కానిస్టేబుల్ అతుల్ శర్మ ఆ కాలనీకి బయల్దేరారు. అతుల్ శర్మ డిస్కవరీ ఛానల్ చూసి పాములను కాపాడటం నేర్చుకున్నాడు. 2008 నుంచి ఇప్పటివరకు అతుల్ శర్మ దాదాపు 500 పాములను రక్షించారు. ఈసారి పాము నీటి పైపులైనులో ఉదంని తెలుసుకుని దానిని బయటకు రప్పించేందుకు పురుగమందును నీటిలో కలిపాడు. దాంతో పాము అపస్మాకరక స్థితికి వెళ్లింది. వెంటనే దానిని బయటకు తీసి సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. ఆ మొత్తం ఘటనను చుట్టుపక్కల వాళ్లు కళ్లార్పకుండా చూశారు. కొందరు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతుల్ శర్మ పాముని నోటిలో పెట్టుకుని మరీ సీపీఆర్ చేయడం చూసి అందరూ అతని ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు. మరి.. అతుల్ శర్మ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#MadhyaPradesh : ज़हरीले सांप की जान बचाने के लिए पुलिस वाले ने दिया CPR, VIDEO देख हैरत में पड़े लोग#CPR #SnakeRescue pic.twitter.com/FK8Xft2Myr
— NDTV India (@ndtvindia) October 26, 2023