iDreamPost
android-app
ios-app

దెబ్బకి పేదరికం అవుట్.. లాటరీలో ఏకంగా రూ.795 కోట్లు గెలిచాడు!

  • Published Feb 22, 2024 | 12:21 PM Updated Updated Feb 22, 2024 | 12:21 PM

అదృష్టం ఎప్పుడు ఏ విధంగా ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదు. కేవలం ఒకే ఒక్క రాత్రిలో స్టార్ సెలెబ్రిటీలు అయినా వారు ఉన్నారు.. అలానే ధనవంతులు అయినా వారు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి పట్టిన అదృష్టం కూడా అలాంటిదే.

అదృష్టం ఎప్పుడు ఏ విధంగా ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదు. కేవలం ఒకే ఒక్క రాత్రిలో స్టార్ సెలెబ్రిటీలు అయినా వారు ఉన్నారు.. అలానే ధనవంతులు అయినా వారు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి పట్టిన అదృష్టం కూడా అలాంటిదే.

  • Published Feb 22, 2024 | 12:21 PMUpdated Feb 22, 2024 | 12:21 PM
దెబ్బకి పేదరికం అవుట్.. లాటరీలో ఏకంగా రూ.795 కోట్లు గెలిచాడు!

జీవితంలో ఎంతో మంది ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అయితే, ఒక్కసారైనా వారిని అదృష్టం వరించకపోతుందా అని అపుడపుడు వారిని వారి పరీక్షించుకుంటూ లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమందికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు.. ఏ అదృష్టం కలిసి రాకుండా వారి జీవితం అలానే ఉండిపోతుంది. కానీ, ఎక్కడో కొంతమందికి మాత్రం లాటరీ రూపంలో అదృష్టం వరిస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి వార్తలను ఎన్నో చూశాము. రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిపోయిన వారు ఉన్నారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ వ్యక్తి ఎవరు.. లాటరీ రూపంలో ఎన్ని కోట్ల అదృష్టం అతనిని వరించింది అనే విషయాలు తెలుసుకుందాం.

అందరిని ఆశ్చర్య పరిచే ఈ సంఘటన చైనాలో జరిగింది. చైనా వెల్ఫేర్‌ లాటరీలో ఓ యువకుడిని అదృష్టం లాటరీ రూపంలో వరించింది. ఈ లాటరీలో అతడు గెలుపొందింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అక్షరాలా.. రూ.795 కోట్లు. దీనితో రాత్రికి రాత్రి ఈ వ్యక్తి కోటీశ్వరుడు అయిపోయాడు. ఇప్పటి వరకు చైనా చరిత్రలోనే ఇన్ని కోట్ల రూపాయల లాటరీ తగలడం ఇదే మొదటిసారి. ఈ వ్యక్తికీ సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నైరుతి చైనాలోని గుయిఝౌ ప్రావిన్స్‌కు చెందిన 28 ఏళ్ళ ఓ చిరు వ్యాపారి.. ఒకేసారి 133 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడట. అయితే, ప్రతిసారీ ఒకే గ్రూప్ కు చెందిన ఏడు నంబర్లపై అతను పందెం కాసేవాడని, ఈ క్రమంలో ప్రతి టికెట్‌ పై సుమారు .. రూ.6 కోట్ల చొప్పున బహుమతి వచ్చినట్లు.. అక్కడి వారు తెలిపారు. ఇలా మొత్తంగా ఆ వ్యక్తి రూ.795.84 కోట్లు గెలుచుకున్నట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా అధికారులు వెల్లడించారు. కానీ, ఈ లాటరీని గెలుపొందిన వ్యక్తి వివరాలు మాత్రం ఎక్కడ బయటకు రానివ్వలేదు.

అయితే, ఆ లాటరీని గెలుపొందిన వ్యక్తి ఈ విషయమై స్పందిస్తూ .. ఈ విషయం తెలిసిన తర్వాత తానూ ఎంతో ఆశ్చర్య పోయానని .. తనకు నిద్ర కూడా పట్టలేదని .. మొదట ఈ విషయాన్నీ తానూ నమ్మలేదని.. అది నిజమో కాదో తెలుసుకోవడానికి పలు మార్లు చెక్ చేసుకోవాల్సి వచ్చిందని.. ఆ వ్యక్తి తెలియజేశాడు. అలాగే ఈ పందెం వేయడానికి తన లక్కి నెంబర్‌ను ఉపయోగించినట్లు కూడా అతను తెలియజేశాడు. కాగా, స్ప్రింగ్ ఫెస్టివల్ హాలిడే సందర్భంగా ఈ శుభవార్తను తన కుటుంబ సభ్యులతో పంచుకుంటానని.. ఆ వ్యక్తి సంతోషం వ్యక్తం చేశాడు. అయితే, చైనాలో ఇంత భారీ మొత్తంలో ఒకే వ్యక్తికీ జాక్ పాట్ తగలడం ఇదే మొదటిసారి. అయితే, చైనాలోని వ్యక్తిగత ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం.. వచ్చిన బహుమతిలో ఐదో వంతును అక్కడి ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. మరి, రాత్రికి రాత్రి కోటీశ్వరుడైన చైనా కు చెందిన ఈ వ్యక్తి విషయంలో .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.