Swetha
హెల్త్ డ్రింక్స్ లో పాలతో కలిపి మిక్స్ చేసుకుని తాగేందుకు ఎన్నో డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో నుంచి బోర్న్ విటాని హెల్త్ డ్రింక్ క్యాటగెరీస్ నుంచి తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హెల్త్ డ్రింక్స్ లో పాలతో కలిపి మిక్స్ చేసుకుని తాగేందుకు ఎన్నో డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో నుంచి బోర్న్ విటాని హెల్త్ డ్రింక్ క్యాటగెరీస్ నుంచి తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
దేశంలో ఇప్పుడిప్పుడే ఫుడ్ కార్పొరేషన్ సంస్థలు.. కొన్ని ఆహార పదార్ధాలపై జాగ్రత్తలు తీసుకుంటున్న క్రమంలో.. ఒక్కొక్కటిగా కొన్ని ఆహార పదార్ధాలను నిషేదిస్తున్న పరిస్థితులను చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తాజాగా హెల్త్ డ్రింక్స్ లో ఒకటైన పాలతో కలిపి మిక్స్ చేసుకునే డ్రింక్స్ లో ఒకటైన బోర్న్ విటాను హెల్త్ డ్రింక్స్ లో నుంచి నిషేదించాలని.. ఆర్డర్స్ జారీ చేసింది. నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 సెక్షన్ 3క్రింద ఏర్పాటు అయిన ఒక సంస్థ.. సెక్షన్ 14 కింద విచారణ జరిపిన తర్వాత.. ”ఎఫ్ఎస్ఎస్ఏఐ మరియు మోండెలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమాలు మరియు నిబంధనలు ప్రకారం హెల్త్ డ్రింక్స్ నిర్విచించబడలేదు” అంటూ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకుందాం.
హెల్త్ డ్రింక్స్ లో ఒకటైన బోర్న్ విటా అనేది .. ఎప్పటినుంచో కొనసాగుతున్న ఒక బ్రాండ్. మరి ఉన్నట్లుండి ఇప్పుడు ఈ హెల్త్ డ్రింక్ ను నిషేధించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. హెల్త్ డ్రింక్ కేటగిరి క్రింద ఆన్ లైన్ వెబ్ సైట్స్ లో విక్రయిస్తున్న.. పాలా ఉత్పత్తుల మిక్స్, మాల్ట్ బేస్డ్ బేవరేజెస్ లకు దగ్గరగా ఉన్న అన్ని ఆహార ఉత్పత్తులను.. “ప్రొప్రైటరీ ఫుడ్” కింద లైసెన్స్ పొందిన.. అన్ని ఆహార ఉత్పత్తులను గుర్తించిన తర్వాత.. FSSAI ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో.. ఇప్పటికే అన్ని ఈ కామర్స్ వెబ్ సైట్స్ నుంచి.. “హెల్త్ డ్రింక్స్ , ఎనర్జీ డ్రింక్స్ కేటగిరీ నుంచి.. ఇటువంటి పానీయాలను తొలగించాలని.. ఈ తప్పుడు వర్గీకరణను సరిచేయాలని సూచించింది . అయితే మరోవైపు.. బోర్న్ విటాలో షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నాయంటూ.. పరిమితులకు మించి.. చాలా ఎక్కువగా ఉందని ఎన్‌సిపిసిఆర్ చేసిన పరిశోధనలో తేలింది. దీనితో అక్కడి నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి. కాబట్టి బోర్న్ విటాను హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తొలగించనున్నారు.
ఇప్పటికే సమాజంలో కల్తీ అవుతున్న ఆహర పదార్ధాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలో ఎక్కడో ఒక చోట వీటి కారణంగా ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. కొంతమంది తమ ప్రాణాలను సైతం కోల్పోతున్న పరిస్థితుల గురించి నిత్యం వార్తలలో చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే పిల్లలకు హాని కలిగించే కాటన్ క్యాండీలను కొన్ని రాష్ట్రాలలో తొలగిచిన సంఘటనలను చూశాము. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని. ఆరోగ్య సంస్థలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఆహార పదార్ధాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ప్రజలంతా బయట దొరికే ఆహార పదార్ధాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.