iDreamPost
android-app
ios-app

మూడవ తరగతి కొడుకు స్కూల్ ఫీజుపై తండ్రి ఆవేదన.. పోస్ట్ వైరల్

  • Published Apr 12, 2024 | 2:37 PM Updated Updated Apr 12, 2024 | 2:37 PM

కాలం మారుతోంది.. మారుతున్న కాలంలో ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతూ పోతున్నాయి. మధ్య తరగతి వారు సైతం బ్రతకడానికి ఎన్నో కష్టాలను భరించాల్సి వస్తుంది. ఈ క్రమంలో పెరుగుతున్న స్కూల్ ఫీజులు గురించి ఓ తండ్రి పడుతున్న ఆవేదన అందరిని ఆలోచింపజేసేలా చేసింది.

కాలం మారుతోంది.. మారుతున్న కాలంలో ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతూ పోతున్నాయి. మధ్య తరగతి వారు సైతం బ్రతకడానికి ఎన్నో కష్టాలను భరించాల్సి వస్తుంది. ఈ క్రమంలో పెరుగుతున్న స్కూల్ ఫీజులు గురించి ఓ తండ్రి పడుతున్న ఆవేదన అందరిని ఆలోచింపజేసేలా చేసింది.

  • Published Apr 12, 2024 | 2:37 PMUpdated Apr 12, 2024 | 2:37 PM
మూడవ తరగతి కొడుకు స్కూల్ ఫీజుపై తండ్రి ఆవేదన..  పోస్ట్ వైరల్

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పాత కాలం నాటి టిఫిన్స్ బిల్స్ వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటున్నాం. అప్పటి ధరలను.. ఇప్పటి ధరలను పోల్చుతూ నెటిజన్లు ఆశ్చర్యానికి గురవ్వడం.. రకరకాల కామెంట్స్ చేయడం లాంటివి కూడా చూస్తూనే వస్తున్నాం. అయితే పెరిగింది ఒక్క టిఫిన్ బిల్స్ మాత్రమే కాదని.. వాటితో పాటు మారుతూ వస్తున్న కాలంలో.. ప్రతి ఒక్క వస్తువు ధర పెరుగుతూ పోతుందనే సంగతి తెలియనిది కాదు. ఒక సాధారణ మనిషి కుటుంబం కోసం బ్రతుకు బండిని లాగించడం కోసం పడుతున్న కష్ఠాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఆడవారు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, అటు రెండు చేతుల సంపాదిస్తున్న కూడా పెరుగుతున్న ధరల కారణంగా అవి ఏ మాత్రం సరిపోని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలానే చాలీ చాలని జీతాలతో సర్దుకుపోతూ.. కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న స్కూల్ ఫీజుల విషయమై ఒక తండ్రి పడుతున్న ఆవేదన అందరిని ఆలోచింపజేసేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈరోజుల్లో చిన్న పిల్లల స్కూల్ ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా స్కూల్స్ లో చూసినట్లయితే.. కేవలం నర్సరీ, ఎల్ కేజీ , యూకేజీ చదువుతున్న పిల్లలకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంత ఎందుకు వసూళ్లు చేస్తున్నారని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే రకరకాల కారణాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటూ ఇలా ఎదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఇక తల్లి దండ్రులు కూడా అటు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత ఎలా ఉంటుందో తెలియక.. ఇటు ప్రైవేట్ పాఠశాలలలో అంత డబ్బు కట్టలేకపోయినా సరే.. అప్పు చేసి మరి.. అంతంత ఫీజులు కడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గురుగ్రామ్ కు చెందిన ఓ తండ్రి మూడవ తరగతి చదువుతున్న తన కుమారుడు స్కూల్ ఫీజు కేవలం ఒక్క నెలకు రూ.30 వేలు అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తండ్రి ఆవేదనేంటో చూద్దాం.

School boy

ఆ తండ్రి పెట్టిన పోస్ట్ లో ఏం ఉందంటే..”నా కొడుకు స్కూల్ ఫీజు నెలకు రూ.30 వేలు .. ఫీజు సంవత్సరానికి 10 శాతం పెరుగుతోంది .. దీనికి కారణాలు స్కూలు యాజమాన్యాలు చెప్పవు ఫీజుపై ప్రశ్నిస్తే.. మరొక స్కూల్ చూసుకోమని నిర్మొహమాటంగా చెబుతున్నాయి. ఇలానే కొనసాగిస్తే నా కొడుకు 12వ తరగతికి వచేసారోలో ఫీజు రూ.9 లక్షలకు చేరుకుంటుంది” అంటూ ఆ తండ్రి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆ తండ్రి ఆవేదనలో నూటికి నూరు శాతం వాస్తవం ఉందని చెప్పి తీరాలి. ఇది దేశంలో ఉన్న ఎంతో మంది తల్లి దండ్రుల ఆవేదన. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఇలా ఫీజులు పెంచుకుంటూ వెళ్తూ ఉంటే.. తల్లిదండ్రులు మాత్రం ఎక్కడినుంచి అంతంత సొమ్మును తీసుకుని వస్తారు అని.. కనీసం స్కూల్ యాజమాన్యం కొంతైన ఆలోచించరు. ఇక ఆ తండ్రి పెట్టిన పోస్ట్ కు అందరు రకరకాల కామెంట్స్ చేస్తూ.. ఈ పోస్ట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.