iDreamPost
android-app
ios-app

ఫస్ట్ నైట్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన కపుల్స్.. ఇది నిజంగా వెర్రే

  • Published Jul 09, 2024 | 8:45 PM Updated Updated Jul 09, 2024 | 8:45 PM

Couple Shared 1st Night Video: వ్లాగ్స్ పేరుతో ఏవేవో చేస్తున్నారు కొంతమంది. హోమ్ టూర్ లని చెప్పి బెడ్ రూమ్ లు, బాత్రూంలలో జరిగే విషయాలు కూడా బయటపెడుతున్నారు. కొంతమంది అయితే ఫస్ట్ నైట్ వీడియోలు కూడా పెడుతున్నారు. తాజాగా ఓ జంట అదే పని చేసింది.

Couple Shared 1st Night Video: వ్లాగ్స్ పేరుతో ఏవేవో చేస్తున్నారు కొంతమంది. హోమ్ టూర్ లని చెప్పి బెడ్ రూమ్ లు, బాత్రూంలలో జరిగే విషయాలు కూడా బయటపెడుతున్నారు. కొంతమంది అయితే ఫస్ట్ నైట్ వీడియోలు కూడా పెడుతున్నారు. తాజాగా ఓ జంట అదే పని చేసింది.

  • Published Jul 09, 2024 | 8:45 PMUpdated Jul 09, 2024 | 8:45 PM
ఫస్ట్ నైట్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన కపుల్స్.. ఇది నిజంగా వెర్రే

పెళ్లిళ్లు, శోభనాలు వంటి వాటి అర్థాలే మార్చేస్తున్నారు నేటి మనుషులు. పెళ్లి గుట్టుగా చేసుకుని.. ఫస్ట్ నైట్ లు మాత్రం పబ్లిక్ గా చేసుకుంటున్నారు. పెళ్లి గుట్టుగా చేసుకోవడం అంటే పెద్దలకు తెలియకుండా చేసుకోవడం.. ఫస్ట్ నైట్ లు మాత్రం వీడియోలు తీసి ఇవాళ మా ఫస్ట్ నైట్ అని అనౌన్స్ మెంట్ చేయడం, ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నారు. ఏదో పెద్ద యుద్ధ వీరుడిలా, శత్రు దేశం మీద యుద్ధానికి వెళ్తున్నట్టు ఫోజులు కొడుతున్నారు. వ్యూస్ కోసం చేస్తున్నారో లేక పిచ్చితో చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇంకొంతమంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ పేరుతో ముద్దులు, హగ్గులు, రొమాన్స్ లతో రెచ్చిపోతున్నారు. పెళ్లి క్యాన్సిల్ అయితే ఆ అమ్మాయి పరిస్థితి తలచుకుంటేనే బాధ వేస్తుంది. అది సరే ఇంకొంతమంది ఇంకో అడుగు ముందుకేసి ప్రీ ఫస్ట్ నైట్ షూట్ అని, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని నాలుగు గోడల మధ్య రహస్యంగా ఉంచాల్సిన దాన్ని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అబ్బాయిల కంటే కొంచెం సిగ్గు తక్కువ అనుకోవచ్చు.. అమ్మాయిలు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు.

తాజాగా ఒక జంట తమ ఫస్ట్ నైట్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాలుగు గోడల మధ్య రహస్యంగా జరగాల్సిన కార్యాన్ని రికార్డ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మధ్య వ్లాగ్స్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. హోమ్ టూర్ అని, ఇంకేదో టూర్ అని చెప్పి ఇంట్లో గొడవలు అన్నీ చెప్తూ.. చూపిస్తూ వస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఇలానే తయారయ్యారు. వీళ్ళని చూసి మరికొంతమంది ఇలా తయారవుతున్నారు. వ్లాగ్స్ అంటే అర్థమే మార్చేస్తున్నారు. ఒక వ్యక్తి భార్యతో కలిసి శోభనం రాత్రి వ్లాగ్ ను రికార్డ్ చేసి పోస్ట్ చేశాడు. భార్యతో కలిసి నెటిజన్స్ తో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. భార్య గురించి, ఫస్ట్ నైట్ డెకరేషన్ గురించి ఆ వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు. భార్యతో కూడా మాట్లాడించాడు.

హాయ్ ఫ్రెండ్స్.. ఇవాళ మా శోభనం రాత్రి. పూల పరిమళాలతో మంచాన్ని బాగా అలంకరించారు అని ఆ వ్యక్తి మాట్లాడగా.. ఆమె కూడా మాట్లాడింది. అంతేకాదు.. వీడియోలో ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు. ఇది ఓ నెటిజన్ షేర్ చేశాడు. ‘ఫస్ట్ నైట్ వ్లాగ్.. ఈ వ్లాగర్లు పూర్తిగా పిచ్చోళ్ళు అయిపోయారు. బ్లర్డ్ క్లిప్ కోసం వెయిట్ చేయండి’ అంటూ రాసుకొచ్చాడు. దీని మీద నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫన్నీగా రియాక్ట్ అవుతుండగా.. మరికొంతమంది మాత్రం సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. వ్యూస్ కోసమే ఇలా దిగజారుతున్నారని ఒక యూజర్ కామెంట్ చేశారు. వీళ్ళకి ఇది మొదటి రాత్రి కాదని.. వెయ్యో రాత్రి అని.. వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం ఇలా అబద్ధాలు చెప్తున్నారని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తానికి వీడియో అయితే వైరల్ అవుతోంది. 

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet