iDreamPost
android-app
ios-app

WWE సూపర్ స్టార్ గ్రేట్ ఖలీ బైక్ రైడింగ్! ఎన్ ఫీల్డ్ కూడా XLలా ఉంది!

  • Author Soma Sekhar Published - 09:19 PM, Sat - 12 August 23
  • Author Soma Sekhar Published - 09:19 PM, Sat - 12 August 23
WWE సూపర్ స్టార్ గ్రేట్ ఖలీ బైక్ రైడింగ్! ఎన్ ఫీల్డ్ కూడా XLలా ఉంది!

ది గ్రేట్ ఖలీ.. WWE ఆట గురించి తెలిసిన వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఒక్కసారి బాక్సింగ్ రింగ్ లోకి దిగాడు అంటే.. ప్రత్యర్థికి చెమటలు పట్టాల్సిందే. 7 అడుగుల భారీ కాయంతో.. అతడు నడుచుకుంటూ వస్తుంటే బాక్సింగ్ లో ఎంతటి సూపర్ స్టార్లు అయినా వణకాల్సిందే. అలాంటి ది గ్రేట్ ఖలీకి చెందిన ఓ రేర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది లైక్ చేశారు.

ది గ్రేట్ ఖలీ.. వరల్డ్ రెజ్లింగ్ రంగంలో భారతదేశ ఖ్యాతిని రెపరెపలాడించిన ఘనుడు. WWE సూపర్ స్టార్స్ లో ఖలీ ఒకడు. రెజ్లింగ్ అరేనాలో పాల్గొన్న భారతీయులలో ఒకడిగా ఘనత సాధించాడు. రెజ్లింగ్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చేశాడు ఖలీ. అప్పటి నుంచి పలు టీవీ యాడ్స్ లో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఖలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బండిని ది గ్రేట్ ఖలీ నడుపుతున్న వీడియో అది. ఏడడుగుల ఆజానుభాహుడు అయిన ఖలీ ఆ బైక్ ను నడుపుతుంటే.. అది అతడి కింద XL బండిలా కనిపిస్తూ ఉంది.

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే.. మరి అలాంటి బైకే అతడి కింద ఓ పిచ్చుకలా కనిపిస్తుంటే.. వీడియో చూసిన వారంతా నవ్వాపుకోలేకపోతున్నారు. ఖలీ ఎత్తు 7 అడుగులు కావడంతో.. అతడికి ఏ బైక్ అయినా.. అతి చిన్నగానే ఉంటుంది. ఇక అతడి వద్ద టయోటా ఫార్చ్యూనర్, టయోటా గ్లాంజా వంటి కార్లు ఉన్నప్పటికీ.. అతడి హైట్ కు తగ్గట్లుగా వాటిని కస్టమైజ్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. బ్రో ఏంటి బ్రో ఇది.. పాపం ఆ బైక్ పరిస్థితి ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు నీకోసం స్పెషల్ గా ఓ పెద్ద బైక్ తయ్యారు చేయించుకో ఖలీ భయ్యా అంటూ సలహాలు ఇస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by The Great Khali (@thegreatkhali)


ఇదికూడా చదవండి: రూటు మార్చిన టీమిండియా.. ఇకపై గంగూలీ స్ట్రాటజీలతో ముందుకు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి