iDreamPost

రూటు మార్చిన టీమిండియా.. ఇకపై గంగూలీ స్ట్రాటజీలతో ముందుకు..!

  • Author Soma Sekhar Updated - 07:58 PM, Sat - 12 August 23
  • Author Soma Sekhar Updated - 07:58 PM, Sat - 12 August 23
రూటు మార్చిన టీమిండియా.. ఇకపై గంగూలీ స్ట్రాటజీలతో ముందుకు..!

ప్రస్తుతం టీమిండియాలో ఎంతో మంది నైపుణ్యం కలిగిన యువ బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. అయితే బ్యాటర్లు బౌలింగ్ చేసిన సందర్బాలు చాలా అరుదనే చెప్పాలి. ఎప్పుడో ఒకసారి టెస్టుల్లో బౌలింగ్ చేస్తుంటారు బ్యాటర్లు. ఈ క్రమంలోనే జట్టులో బౌలింగ్ చేయగలిగే బ్యాటర్లు ఉన్నారని, ఇకపై వారు బౌలింగ్ చేస్తారని టీమిండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే వెస్టిండీస్ సిరీస్ తో అరంగేట్రం చేసిన ఇద్దరు యువ బ్యాటర్లు ఇక నుంచి బౌలింగ్ చేస్తారని చెప్పుకొచ్చాడు మాంబ్రే. దీంతో గతంలో గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుతం అమలు చేయడానికి సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా త్వరలో ఆడనున్న మ్యాచ్ ల్లో యంగ్ ప్లేయర్స్ తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్ లతో బౌలింగ్ చేపిస్తానని టీమిండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరికి బ్యాట్ తో రాణించే సత్తాతో పాటు బౌలింగ్ వేసే నైపుణ్యం కూడా ఉందని ప్రశంసించాడు. త్వరలోనే తిలక్ వర్మ, యశస్వీ బంతితో మైదానంలోకి దిగడం చూస్తారని కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా.. అన్ని విభాగాల్లో రాణించగల ఆటగాళ్లు జట్టులో ఉంటే బాగుంటుందని ఆతడు తెలిపాడు. అండర్ 19 క్రికెట్ ఆడేటప్పుడు తిలక్, యశస్వీలు బౌలింగ్ చేయడం నేను చూశానని చెప్పుకొచ్చాడు బౌలింగ్ కోచ్ మాంబ్రే. రెగ్యూలర్ బౌలర్లుగా ఎదగగల సత్తా వారిలో ఉందని అతడు పేర్కొన్నాడు.

ఇక ఇలాంటి ఆప్షన్లు ఉన్న ఆటగాళ్లు జట్టుకు చాలా ఉపయోగకరమని, ఇలాంటి ప్లేయర్లపై మేం కూడా ఫోకస్ పెడుతున్నామని మాంబ్రే చెప్పుకొచ్చాడు. త్వరలోనే తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్ లు టీమిండియా తరపున బౌలింగ్ చేయడం మీరు చూస్తారు.. కనీసం ఒక్క ఓవర్ వేయడం అయినా వారు వేస్తారని పోరస్ మాంబ్రే స్పష్టం చేశాడు. కాగా.. తిలక్ వర్మ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 9 మ్యాచ్ ల్లో 3వికెట్లు తీయగా.. 25 లిస్ట్-ఏ మ్యాచ్ ల్లో 8 వికెట్లు తీశాడు. ఇక యశస్వీ 32 లిస్ట్ ఏ మ్యాచ్ ఆడి 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా.. ఇలాంటి స్ట్రాటజీని గతంలో గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా అనుసరించింది. గతంలో టీమిండియా జట్టులో దాదాపుగా అందరు బ్యాటర్లు బౌలింగ్ చేసేవారు. ఒక్క ద్రవిడ్, లక్ష్మణ్ మినహా సచిన్, సెహ్వాగ్ లాంటి ఎందరో క్రికెటర్లు పార్ట్ టైమ్ బౌలర్లుగా జట్టుకు ఉపయోగపడేవారు.  ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ కోచ్ చేసిన వ్యాఖ్యలతో దాదా స్ట్రాటజీని మళ్లీ జట్టులోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. మరి రూటు మార్చి దాదా స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని చూస్తున్న టీమిండియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: టీమిండియాపై పాక్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు! పాక్‌తో పోల్చుకుంటే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి