iDreamPost
android-app
ios-app

బిడ్డ కన్నా పెంపుడు కుక్క ముద్దు: నెటిజన్లతో తిట్టించుకుంటున్న ప్రబుద్ధుడు

బిడ్డ కన్నా పెంపుడు కుక్క ముద్దు: నెటిజన్లతో తిట్టించుకుంటున్న ప్రబుద్ధుడు

పెంపుడు కుక్క కోసం పసి బిడ్డను వదిలేశాడో ప్రబుద్ధుడు. వైరలైన ఈ వీడియో చూసి నెటిజన్లు అతగాణ్ణి నానా తిట్లూ తిడుతున్నారు. రెడిట్ లో పోస్ట్ అయిన ఈ వీడియోలో ఒకతను స్ట్రోలర్ లో పాపను తీసుకెళ్తున్నాడు. అతని పక్కనే పెంపుడు కుక్క నడుస్తోంది. ఇంతలో ఒక ఇంట్లో నుంచి ఇంకో చిన్న కుక్క బయటికి ఉరికింది. దీన్ని చూసి మొదటి కుక్క అదిరిపడింది. మన హీరో కంగారులో పాపను వదిలేసి కుక్కను గట్టిగా పట్టుకున్నాడు. ఈలోపే రెండో కుక్క ఓనర్ పరుగు పరుగున వచ్చి జారిపోతున్న స్ట్రోలర్ వెంట పడ్డాడు. అప్పటికి గానీ మన హీరోకి విషయం అర్థం కాలేదు. తను కూడా పాప కోసం పరిగెట్టాడు.

ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజెన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. కుక్క కోసం బిడ్డను వదిలేశావా అని ఒకరు వెక్కిరిస్తే, చక్కెర పొట్లమంత లేని బుజ్జి కుక్కకు భయపడి పాపను వదిలేశాడు అని ఇంకొందరు తిట్టి పోస్తున్నారు. మరికొందరు రెండో వ్యక్తి సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet