iDreamPost
android-app
ios-app

సమంతకు వీడియో కాల్ చేసిన విజయ్ దేవరకొండ! ఎందుకో తెలుసా?

  • Author Soma Sekhar Published - 02:36 PM, Mon - 28 August 23
  • Author Soma Sekhar Published - 02:36 PM, Mon - 28 August 23
సమంతకు వీడియో కాల్ చేసిన విజయ్ దేవరకొండ! ఎందుకో తెలుసా?

డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా.. మూవీ యూనిట్ ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభించింది. రోజుకో అప్డేట్ ఇస్తూ.. నెట్టింట ట్రెండింగ్ లో ఉంటోంది. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు విజయ్. సమంత కు అర్దరాత్రి 1.30 గంటలకు వీడియో కాల్ చేశాడు. అదే వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సమంతకు అర్దరాత్రి విజయ్ వీడియో కాల్ చేశాడు. ఈ వీడియోలో విజయ్ “నీకు ఒక జోక్ చెబుదామని వీడియో కాల్ చేశాను” అనగా.. టైమ్ అర్దరాత్రి 1.30 అవుతుంది. ఇప్పుడు జోక్ ఏంటని సామ్ ప్రశ్నించింది. ఆ తర్వాత సామ్ కోసం ఓ పాట పాడాడు రౌడీ హీరో విజయ్. ఖుషి మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ‘నా రోజా నువ్వే’ పాట పాడాడు. సామ్ ను మిస్ అవుతున్నట్లు ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు విజయ్. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

కొంత మంది నెటిజన్లు ఇది వీడియో కాల్ కాదని, రికార్డ్ చేసిన వీడియోని ఎడిట్ చేశారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ విజయ్ ట్వీట్ తో మరోసారి ఖుషి ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రమోషన్లలో భాగంగానే విజయ్ ఈ కాల్ చేశాడని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమాపై వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు డైరెక్టర్ శివ నిర్వాణ. పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో.. అనే లైన్ పై మూవీ తీయాలని అనుకున్నా. సాధారణంగా ఇలాంటి కథను ఒకే సాంగ్ లో చూపిస్తారు. కానీ నేను ఆ పాటనే సినిమాగా తీయాలని అనుకున్నా. ఖుషి ఏ సినిమాతో పోల్చకండి.. అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. మరి విజయ్ దేవరకొండ సమంతకు వీడియో కాల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: ప్రముఖ నటుడు వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss