iDreamPost
android-app
ios-app

పెళ్లిపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Author Soma Sekhar Published - 09:53 PM, Thu - 10 August 23
  • Author Soma Sekhar Published - 09:53 PM, Thu - 10 August 23
పెళ్లిపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే? చాలా మంది పేరు లిస్ట్ లోకి వస్తాయి. అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకడు. ప్రస్తుతం విజయ్ కు సంబంధించిన పెళ్లి వార్తలు వైరల్ గా మారాయి. ఇక లైగర్ తో డిజాస్టర్ అందుకున్న విజయ్.. ఖుషి మూవీతో మళ్లీ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీ.. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. తాజాగా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ వేడుకలో పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో పాటుగా తాను పెళ్లెప్పుడు చేసుకుంటాడో చెప్పుకొచ్చాడు.

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. దీంతో అతడు పెళ్లెప్పుడు చేసుకుంటాడో అని అందరు ఎదురుచూస్తున్నారు. తాజాగా జరిగిన ఖుషి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈవెంట్ లో విజయ్ దేవరకొండను అభిమానులు పెళ్లెప్పుడు అన్న? అని ప్రశ్నించగా.. విజయ్ ఈ విధంగా స్పందించాడు. “నాకెందుకో వచ్చే రెండు, మూడేళ్లలో నా పెళ్లి జరుగుతుందనిపిస్తోంది. చాలా కాలంగా లైఫ్ పార్ట్ నర్ కోసం వేచిచూస్తున్నాను. అయితే ఇప్పుడే పెళ్లికి రెడీగా లేను. స్టార్టింగ్ లో పెళ్లి అంటే చిరాకు, కోపం వచ్చేది. కానీ ఇప్పుడెందుకో అలా అనిపించడం లేదు. పెళ్లి చేసుకున్న జంటలను చూస్తుంటే.. అందరూ దాన్ని అనుభవించి తీరాల్సిందే” అని చెప్పుకొచ్చాడు ది విజయ్ దేవరకొండ. మరి పెళ్లి గురించి విజయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఆ డైరెక్టర్ నన్ను గదిలోకి పిలిచి.. బెడ్ పైకి తోశాడు: వర్షిణి

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet