iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్.. అతి త్వరలోనే!

  • Published Aug 29, 2023 | 7:45 PM Updated Updated Aug 29, 2023 | 7:45 PM
  • Published Aug 29, 2023 | 7:45 PMUpdated Aug 29, 2023 | 7:45 PM
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్.. అతి త్వరలోనే!

విజయ్ దేవరకొండ.. ఇప్పుడున్న యంగ్ స్టార్లలో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన హీరో. విజయ్ దేవరకొండ- సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం విజయ్- సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చి చాలా రోజులు అయిందంటూ తెలుగు సినిమా ప్రేక్షకులు ఖుషీ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కాకుండానే.. విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ కోసం మరో బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు చెబతున్నాడు.

ఖుషి సినిమా కోసం అన్ని ఏజ్ గ్రూప్స్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ లవ్లీ లవ్ స్టోరీని సెప్టెంబర్ 1న థియేటర్లలో విట్ నెస్ చేసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా లిరికల్ సాంగ్స్ తో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఇంక ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో.. అప్పటి నుంచి అందరూ విజయ్- సమంత ప్లేస్ లో తమనే ఊహించుకుంటున్నారు. అటు లవర్స్, ఇటు కపుల్స్ అంతా తమ రియల్ లైఫ్ కి రిలేట్ చేసుకుంటున్నారు. అక్కడే ఈ సినిమా సక్సెస్ అయింపోయింది. ఖుషీ కోసం ఎదురుచూస్తున్న విజయ్ ఫ్యాన్స్ కి మరో సర్ ప్రైజ్ ఉంది. రౌడీ హీరో ఒక బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్టోరీ పోస్ట్ చేశాడు. అయితే ఆ స్టోరీలో ఉన్న పిక్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపుతోంది.

ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ పిక్ లో ఒక అమ్మాయి చేయి ఉంది. విజయ్ చేతిలో ఒక అమ్మాయి చేయి వేసున్న పిక్ అది. “చాలానే జరుగుతున్నాయ. త్వరలోనే అనౌన్స్ చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ పిక్ చూసిన తర్వాత విజయ్ ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకుంటున్నారు. కొందరు నెక్ట్స్ సినిమా ప్రాజెక్ట్ గురించి కావొచ్చని అనుకుంటున్నారు. పైగా స్పెషల్ అనగానే తన క్లోజ్ ఫ్రెండ్ రష్మికతో ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అని కంక్లూజన్ కి వస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది.. పెళ్లి గురించి కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ ఖుషి సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి విజయ్ పెళ్లి గురించి కాస్త ఎక్కువగానే మాట్లాడాడు. సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని చెప్పాడు. ఒకవేళ పెళ్లికి సంబంధించి ఏమైనా అనౌన్స్ మెంట్ ఉండబోతోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియక తికమక పడిపోతున్నారు. రౌడీ హీరో ఏదో పెద్ద అనౌన్స్ మెంట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి.. విజయ్ దేవరకొండ ఇస్తున్న సర్ ప్రైజ్ ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgray girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom