iDreamPost
android-app
ios-app

తొలిసారి హీరోయిన్ గా ట్రాన్స్ జెండర్.. ఏ సినిమాలో అంటే?

  • Author Soma Sekhar Published - 01:08 PM, Fri - 22 September 23
  • Author Soma Sekhar Published - 01:08 PM, Fri - 22 September 23
తొలిసారి హీరోయిన్ గా ట్రాన్స్ జెండర్.. ఏ సినిమాలో అంటే?

చెరువులోకి కొత్త నీరు వచ్చి.. పాతనీరు వెళ్లిపోయినట్లుగా.. ఇండస్ట్రీలోకి కొత్త నటీ, నటులు వస్తుంటారు, పోతుంటారు. అయితే ఇది నటీ, నటుల విషయంలోనే కాక కథల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. కొత్త కంటెంట్ లను మాత్రమే ఎంకరేజ్ చేస్తుంటారు ప్రేక్షకులు. అంతే కాకుండా కొత్త వారితో చేసే ప్రయోగాలను సైతం ప్రేక్షకులు అక్కున చేర్చుకుని విజయాన్ని అందించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే కన్నడ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓ ట్రాన్స్ జెండర్ ను హీరోయిన్ గా పెట్టి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

వైశాలీ.. ట్రాన్స్ జెండర్ గా సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది. కానీ తనలో ఉన్న ఆసక్తికి మాత్రం చంపుకోలేదు. చిన్నప్పటి నుంచి వైశాలీకి నటన అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే ఇప్పుడు ఆమెను హీరోయిన్ ను చేసింది. గతంలో గోవాలోని ఓ నైట్ క్లబ్ లో డ్యాన్సర్ గా తన జీవితాన్ని ప్రారంభించి.. నటనపై ఉన్న ఆసక్తితో బెంగళూరుకు వచ్చేసింది. ఈ క్రమంలోనే కామెడీ ఖిలాడీ సీజన్-2 కోసం జరిగిన ఆడిషన్స్ లో సైతం పాల్గొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శాండల్ వుడ్ లో తెరకెక్కుతున్న ‘మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ’ సినిమాలో ఏకంగా హీరోయిన్ గా నటిస్తోంది వైశాలీ. దీంతో తొలిసారి ఓ హీరోయిన్ గా నటించే అరుదైన అవకాశం దక్కించుకుంది వైశాలీ. ఇప్పటి వరకు చాలా మంది ట్రాన్స్ జెండర్ లు కొన్ని పాత్రల్లో మెరిసినప్పటికీ.. హీరోయిన్ గా చేయలేదు.

ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించగా.. వైశాలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “మా ట్రాన్స్ జెండర్స్ కూడా ఒక జీవితం ఉంది. మేం ఎందుకు అడుక్కోవాలి? అందుకే నటించాలని కలలు కన్నాను. అందుకు తగ్గట్లుగానే ప్రయాత్నాలు చేసి.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నాను. ఇక ఈ మూవీలో ఆఫర్ నాకు ఫేస్ బుక్ ద్వారా వచ్చింది” అని చెప్పుకొచ్చారు వైశాలీ. కాగా.. ప్రజలు ట్రాన్స్ జెండర్లను చూసే తీరుపై వైశాలీ అసహనం వ్యక్తం చేసింది. ఇక ఈ చిత్రంలో ఆరుగురు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో వైశాలీ ఒకరు. హీరోగా సుబ్రమణి నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 6న విడుదల కానుంది. మరి తొలిసారి హీరోయిన్ గా ఓ ట్రాన్స్ జెండర్ నటిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: విజయ్ ‘లియో’కి షాక్.. విడుదలపై అయోమయం!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet