iDreamPost

విజయ్ ‘లియో’కి షాక్.. విడుదలపై అయోమయం!

  • Author Soma Sekhar Published - 11:16 AM, Fri - 22 September 23
  • Author Soma Sekhar Published - 11:16 AM, Fri - 22 September 23
విజయ్ ‘లియో’కి షాక్.. విడుదలపై అయోమయం!

ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాలంటే.. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి. ఇక మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమా రైట్స్, డిస్టిబ్యూటర్ల లెక్కలతో పాటుగా ఎన్నో బిజినెస్ కు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ అంశాల్లో ఏ ఒక్క విషయంలో తేడా కొట్టిన సినిమా విడుదలకే మోసం వస్తుంది. తాజాగా ఇలాంటి ఇబ్బందుల్లోనే దళపతి విజయ్ ‘లియో’ సినిమా చిక్కుకున్నట్లు సమాచారం. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను కూడా ప్రారంభించింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే సినిమాకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ.. లియోపై భారీ అంచనాలను పెంచుతోంది. అయితే అక్కడ మాత్రం లియో విడుదలపై అయోమయం ఏర్పడింది.

దళపతి విజయ్, త్రిష జంటగా.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘లియో’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదలకు సిద్దమవుతోంది. దీంతో మేకర్స్ పబ్లిసిటి స్టార్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్కో పోస్టర్ ను విడుదల చేస్తూ.. సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సినిమా హిందీ విడుదల విషయంలో అయోమయం నెలకొంది. పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 19న విడుదలవుతున్న ఈ చిత్రం హిందీలో మాత్రం అదే రోజు రిలీజ్ కాకపోవచ్చనే వార్త ఇప్పడు వైరల్ గా మారింది. దానికి కారణం నార్త్ లో అనుసరిస్తున్న ఓటీటీ అగ్రిమెంట్ విధానమే.

హిందీ బెల్డ్ లో ఏ మూవీ విడుదల అయినా గానీ 8 వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్ అని అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 8 వారాల గ్యాప్ లేకుండా ఏ సినిమా హిందీలో విడుదల కాకూడదనే రూల్ ఉంది. ఇక ఈ రూల్ ను కచ్చితంగా PVR/Inox/Cinepolis నేషనల్ చైన్స్ వారు ఫాలో అవుతున్నారు. అయితే లియో రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ 4 వారాల్లో ఓటీటీలోకి వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ రెండు విషయాలు విరుద్దంగా ఉండటంతో.. ప్రస్తుతం దీనిపై డిస్కషన్ నడుస్తున్నాయి. ఇటీవలే జైలర్ మూవీకి సైతం ఇదే సమస్య వచ్చింది. కాగా.. హిందీ బెల్డ్ నుంచి సౌత్ సినిమాలకు మంచి ఆదాయం లభిస్తోంది. ఇంతకు ముందు కమల్ హాసన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమ్ కు దాదాపు రూ.20 కోట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో ఈసారి లియో ద్వారా ఈ రికార్డును అధిగమించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. చూడాలి మరి లియో విడుదల విషయంలో ఏం జరగబోతోందో?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి