iDreamPost
android-app
ios-app

ఇది ప్రభాస్ రేంజ్! విడుదలకు ముందే సలార్‌కి రూ.350 కోట్లు!

  • Published Sep 13, 2023 | 5:00 PM Updated Updated Sep 13, 2023 | 5:00 PM
  • Published Sep 13, 2023 | 5:00 PMUpdated Sep 13, 2023 | 5:00 PM
ఇది ప్రభాస్ రేంజ్!  విడుదలకు ముందే సలార్‌కి రూ.350 కోట్లు!

ది మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ సలార్ 1-సీజ్ ఫైర్ విడుదలకు ముందు రికార్డులను బద్దలు కొడుతుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులే కాకుండా ప్రేక్షకులు సైతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. డైనోసార్( ప్రభాస్) ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూపులకు అడ్డుకట్ట వేస్తూ ఈ నెల సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు మేకర్స్. అభిమానుల ఆశలపై నీళ్లు జల్లేస్తూ ఆ తేదీన విడుదల చేయడం లేదంటూ ఇటీవల ప్రకటించారు. అయితే ఎప్పుడూ రిలీజ్ చేస్తారన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. కాగా, నవంబర్ లేదా డిసెంబర్‌లో చిత్రం థియేటర్లలో సందడి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే విదేశాల్లో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి. ఈ సినిమా వాయిదాతో ఆ డబ్బులను తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే విడుదల తేదీని తర్వలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే తాజాగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కళ్లు చెదిరే ధరకు శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం.. శాటిలైట్ హక్కులను స్టార్ టీవీ రికార్డు రికార్డు ధరకు సొంతం చేసుకుంది. మొత్తం ఐదు భాషల హక్కులను సదరు సంస్థే దక్కించుకుంది. అలాగే ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడగా.. చివరకు నెట్ ఫ్లిక్స్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. దీని కోసం రూ. 185 కోట్లు చెల్లించనుందని సమాచారం. ఇక మొత్తంగా శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ రూ. 350 కోట్లకు సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇదే హయ్యస్ట్ రికార్డ్ డీల్ అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. సినిమా విడుదలకు ముందే ఈ స్థాయిలో సలార్ రికార్డులు సృష్టిస్తుంటే.. విడుదలయ్యాక బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని సినీ పండితులు భావిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. పృధ్వీ సుకుమారన్, శృతి హాసన్ కీలక పాత్రధారులు. మరి ఎప్పుడు ఈ సినిమా సందడి చేస్తుందో అని వెయింటింగ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అది దా ప్రభాస్ రేంజ్ అంటూ కొనియాడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet