Tirupathi Rao
Tirupathi Rao
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. రూ.371 కోట్ల అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన చంద్రబాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. ఈ విషయంపై తమను నిర్ణయం తీసుకోనివ్వాల్సిందిగా హైకోర్టు తెలిపింది. అలాగే రెండ్రోజుల్లో తీర్పును వెలువరిస్తామని హైకోర్టు వెల్లడించింది. అయితే ఇప్పుడు చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేస్తూ పీటీ వారెంట్ దాఖలు చేశారు. రూ.121 కోట్లు దారిమళ్లాయంటూ సిట్ దర్యాప్తులో తేల్చింది. 2021లోనే ఈ ఫైబర్ నెట్ కుంభకోణంలో సీఐడీ 19 మందిపై కేసు కూడా నమోదు చేసింది.
చంద్రబాబు అరెస్టు కావడంపై ఏపీ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ క్యాడర్, మిత్ర పక్షాలు తప్ప చంద్రబాబు అరెస్టును ఖండించే వ్యక్తులు కనిపించడం లేదు. కాస్త పేరున్న సెలబ్రిటీలు, ప్రముఖులు ఎవరు చంద్రబాబు అరెస్టును ఖండిస్తారా అని టీడీడీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కానీ, అలాంటి పరిస్థితి అయితే కనిపించడంలేదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లు బాబు అరెస్టు ఖండిస్తారని ఎదురుచూసిన శ్రేణులకు నిరాశే మిగిలింది. మా సారు అరెస్టును ఖండించండి మహాప్రభో అంటూ స్టార్ హీరోల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని టాక్ వినిపిస్తోంది. ఇంత చేసినా స్పందన కరువైందని కంగారు పడుతున్న వారికి ఇంకో షాకింగ్ విషయం తెలిసింది.
చంద్రబాబు అరెస్టును ఖండించకపోగా ఓ స్టార్ హీరో అయితే గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు సమాచారం. ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలకు పాపం ముఖంలో నెత్తురు చుక్క లేకుండాపోయింది. చంద్రబాబు అరెస్టు వార్త తెలియగానే ఆ స్టార్ హీరో సంబరాల్లో మునిగిపోయాడని తెలుస్తోంది. అంతేకాకుండా తన మిత్రులు, సన్నిహితులు, బంధువులను పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్లు వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి టీడీపీ వర్గాలకు మింగుడు పడటం లేదు. ఎందుకంటే.. ఆ పార్టీకి వచ్చిన అతిథుల్లో సొంత సామాజిక వర్గానికి చెందిన డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు ఉన్నారని సమాచారం. ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తే.. అసలు ఎందుకు స్పందించాలి అని అడిగేటట్లు ఉన్నారంట. అందుకే టీడీపీ వర్గాలు కూడా ఈ పార్టీ విషయం తమకి తెలియలేదు అన్నట్లు మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన వ్యక్తికి సపోర్ట్ చేస్తే.. ప్రజల్లో తమకు ఉన్న పేరు కూడా పాడవుతుందని సెలబ్రిటీలు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.