iDreamPost
android-app
ios-app

నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్.. షాకిచ్చిన నిర్మాతలు!

  • Author Soma Sekhar Published - 05:37 PM, Thu - 14 September 23
  • Author Soma Sekhar Published - 05:37 PM, Thu - 14 September 23
నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్.. షాకిచ్చిన నిర్మాతలు!

నలుగురు హీరోలకు రెడ్ కార్డ్.. అదేంటి హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వడమేంటి? వాళ్లేమైనా గేమ్స్ ఆడారా? అని మీకు అనుమానం రావొచ్చు. కానీ ఈ నలుగురు హీరోలు ఏ ఆటా ఆడలేదు. మరెందుకు వారికి రెడ్ కార్డ్ ఇచ్చారు? ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఇక్కడికే వస్తున్నా. కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన శింబు, ధనుష్, విశాల్, అధర్వలకు కోలీవుడ్ నిర్మాతల మండలి రెడ్ కార్డులను జారీ చేసింది. బుధవారం(సెప్టెంబర్ 13)న చెన్నైలో జరిగిన నిర్మాతల సమావేశంలో వివిధ అంశాలపై చర్చజరిగింది. అందులో ఇది ఒకటి. ఈ నలుగురు హీరోలపై వచ్చిన ఫిర్యాదులను విచారించిన కౌన్సిల్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్ కు గురైయ్యారు. మరి ఈ నలుగురి హీరోలకు రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళ నిర్మాతల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 13న చెన్నైలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి నలుగురు హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వడం. స్టార్ హీరోలు అయిన శింబు, ధనుష్, అధర్వ, విశాల్ లకు రెడ్ కార్డ్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. నిర్మాత మైఖేల్ రాయప్పన్ తో ఏర్పడిన వివాదాలపై పలు ఫిర్యాదులు వచ్చాయి, కానీ వీటిపై చర్చకు గానీ.. ఎలాంటి క్లారిటీ గానీ ఇవ్వకపోవడంతో హీరో శింబుకు రెడ్ కార్డ్ జారీ చేసింది నిర్మాతల మండలి. అలాగే మరో హీరో అయిన విశాల్.. గతంలో నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిధులను పక్కదారి పట్టించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విశాల్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో.. అతడికి రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు.

ఇక ‘తేనాండాల్’ చిత్రాన్ని ముందుగా అంగీకరించి, 80 శాతం షూటింగ్ పూర్తి అయినప్పకీ ధనుష్ షూటింగ్ కు హాజరుకాకుండా నిర్మాతకు నష్టం కలిగించాడని ఫిర్యాదు రావడంతో.. అతడికి సైతం రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు. అలాగే మరో హీరో అయిన అధర్వ ప్రొడ్యూసర్ మథియాజకన్ నిర్మాణ సంస్థలో ఓ చిత్రం చేస్తానని అంగీకరించాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ అతడి నుంచి స్పందన రాకపోవడంతో అతడికి సైతం రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఇక ఒకేసారి నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ ఇస్తున్నట్లు తమిళ నిర్మాతల మండలి ప్రకటించడంతో.. అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రెడ్ కార్డ్స్ విషయంపై హీరోలు ఏవింధంగా స్పందిస్తారో వేచిచూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel