iDreamPost
android-app
ios-app

నీకసలు కృతజ్ఞతనేదే లేదు.. హీరో సూర్యపై ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌..

  • Published Jul 10, 2023 | 11:15 AM Updated Updated Jul 10, 2023 | 11:15 AM
  • Published Jul 10, 2023 | 11:15 AMUpdated Jul 10, 2023 | 11:15 AM
నీకసలు కృతజ్ఞతనేదే లేదు.. హీరో సూర్యపై ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌..

హీరో సూర్యపై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఆయన మంచోడు కాదని అంటున్నారు. సూర్య ఫ్యాన్స్‌ ఏంటి ? ఆయనపై మండిపడటం ఏంటి? అని అనుకుంటున్నారా? అవును! ప్రముఖ దివంగత తమిళ దర్శకుడు కేవీ ఆనంద్‌ విషయంలో సూర్య వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య పలు హిట్టు సినిమాలు చేశారు.  సూర్య హీరోగా.. 2009లో వచ్చిన ‘వీడొక్కడే’ సినిమాతోటే కేవీ ఆనంద్‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఈ సినిమా సూర్య ఖాతాలో పెద్ద హిట్‌ను నమోదు చేసింది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్రదర్స్‌’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత సూర్య-కేవీ ఆనంద్‌ల కాంబినేషన్‌లో మూడో సినిమాగా ‘బందోబస్త్‌’ వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. 2019లో బందోబస్త్‌ సినిమా విడుదలైంది. సరిగ్గా రెండు సంవత్సరాలకు ఆనంద్‌ కరోనా బారినపడ్డారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తాజాగా, కేవీ ఆనంద్‌ కూతురు వివాహం జరిగింది.

ఈ వివాహానికి ఇండస్ట్రీనుంచి ఎవ్వరూ హాజరుకాలేదు. ఒక్క విజయ్‌ సేతుపతి తప్ప. ఆయన కూడా కేవీ ఆనంద్‌ కూతురి రిసెప్చన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే సూర్యపై ఆయన ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. కేవీ ఆనంద్‌తో ఎంతో మంచి స్నేహం ఉన్న మీరు కూడా పెళ్లికి వెళ్లకపోవటం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. హిట్లు లేని సమయంలో మీకు ఇండస్ట్రీ హిట్టు ఇచ్చిన దర్శకుడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని అంటున్నారు. సూర్య అసలు మంచోడు కాదంటూ ట్రోలింగ్స్‌ చేస్తున్నారు. బతికున్నపుడు మాత్రమే అలాంటి వారు మీకు గుర్తు ఉంటారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి, ఫ్యాన్స్‌ సూర్యపై ట్రోలింగ్స్‌ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss