iDreamPost
android-app
ios-app

స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం!

  • Published Sep 12, 2023 | 3:55 PM Updated Updated Sep 12, 2023 | 3:55 PM
  • Published Sep 12, 2023 | 3:55 PMUpdated Sep 12, 2023 | 3:55 PM
స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం!

ఈ మధ్య పలు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు, ఇతర సాంకేతిక వర్గానికి చెందినవారు.. కుటుంబ సభ్యులు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. అనారోగ్యంతో కొంతమంది, రోడ్డు ప్రమాదాల్లో మరికొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వారు కన్నుమూస్తున్నారు. తాజాగా మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఏడాదిలో మమ్ముట్టి ఇంట వరుస విషాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఆయన సోదరి అమీనా (70) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అమీనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఈ రోజు తుది శ్వాస విడిచారు. అమీనాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్‌లో మమ్ముట్టి అమ్మ ఫాతిమా ఇస్మాయిల్ (93) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఆమె కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఫాతిమా ఇస్మాయిల్ కి మమ్ముట్టి, ఇబ్రహిం కుట్టి, జకారియా కుమారులతో పాటు అమీనా, సౌదా, షఫినా అనే ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు.

Mammotty sister passed away

ఐదు దశాబ్దాలపాటు మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మమ్ముట్టి మకుటం లేని మహరాజుగా వెలిగిపోతున్నారు. ఇప్పటికీ ఆయన కుర్ర హీరోలకు పోటీగా నటిస్తున్నారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్ కూడా హీరోగా తన సత్తా చాటుతున్నారు. మహానటి, సీతారామం లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు దుల్కర్‌. ఇక తెలుగులో ఎన్నో డబ్బింగ్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి.. స్వాతి కిరణం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ చిత్రంలో నటించాడు. మమ్ముట్టి సోదరి మరణంతో మాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. పలువురు సినీ సెలబ్రెటీలు మ‌మ్ముట్టికి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss