iDreamPost
android-app
ios-app

కోహ్లీ మా సొంత మనిషి.. అతను మా ఇంటి అల్లుడు: షారుఖ్‌ ఖాన్‌

  • Author Soma Sekhar Published - 07:29 PM, Wed - 27 September 23
  • Author Soma Sekhar Published - 07:29 PM, Wed - 27 September 23
కోహ్లీ మా సొంత మనిషి.. అతను మా ఇంటి అల్లుడు: షారుఖ్‌ ఖాన్‌

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిన విషయమే. ఇక విరాట్ కు సాధారణ అభిమానులతో పాటుగా.. సినీ, రాజకీయ నాయకులు కూడా అభిమానులుగా ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక సినీ ప్రముఖులు ఇతర సెలబ్రిటీలపై ఉన్న అభిమానాన్ని సందర్భాన్ని బట్టి వ్యక్త పరుస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సైతం టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై ఉన్న ప్రేమను తెలియపరిచాడు. సోషల్ మీడియాలో నిర్వహించిన #AskSRK లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే రేంజ్ లో సమాధానం ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో.

షారుఖ్ ఖాన్.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ ఉంటాడు. అందులో భాగంగానే అప్పుడప్పుడు నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహిస్తూ ఉంటాడు ఈ స్టార్ హీరో. తాజాగా అభిమానులతో ట్విట్టర్ వేదిగకా #AskSRK నిర్వహించాడు బాలీవుడ్ కింగ్ ఖాన్. ఇక ఇందులో అభిమానులు తమ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడిగి షారుఖ్ నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడుగుతూ..” విరాట్ కోహ్లీ గురించి ఏదైనా చెప్పండి. ఎందుకంటే మేం రోజూ మీ ఇద్దరికి సంబంధించిన పోస్ట్ లతో ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంటుంది” అని అడిగాడు.

దీనికి షారుఖ్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.”విరాట్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతడు మా సొంత మనిషి. పైగా విరాట్ కోహ్లీ మా ఇంటి అల్లుడు” అని షారుఖ్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకోవడంతో.. విరాట్ బాలీవుడ్ అల్లుడు అయ్యాడన్న అర్ధంలో షారుఖ్ ఇలా అన్నట్లు తెలుస్తోంది. మరి షారుఖ్ ఇచ్చిన ఆన్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş