Tirupathi Rao
Tirupathi Rao
మాస్ మహారాజా రవితేజ వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్నాడు. వాల్తేరు వీరయ్య, రావణాసుర, ధమాకా సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో రవితేజ బిజీగా ఉన్నాడు. రవితేజ తర్వాతి ప్రాజెక్టు టైగర్ నాగేశ్వరరావుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత ఎక్కువవుతాయనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా టీజర్ ఆ రేంజ్ లో ఉంది. మరి.. టైగర్ నాగేశ్వరరావు టీజర్ ఎలా ఉందో చూద్దాం.
సాధారణంగానే రవితేజ సినిమాలో ఫుల్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేస్తాడు. అలాంటిది ఈ సినిమా కథలో యాక్షన్, ఎలివేషన్ కు మంచి స్కోప్ ఉన్నట్లు కనిపిస్తోంది. టైగర్ ఇన్వేషన్ అంటూ రిలీజ్ చేసిన టీజర్ మొత్తం టైగర్ నాగేశ్వరరావు పాత్ర గురించే ఉంది. టైగర్ నాగేశ్వరరావు ఎవరు? ఎలా ఉంటాడు? ఎంతటి అసాధ్యుడు అనే విషయాలను ఈ టీజర్ ద్వారా తెలియజేశారు. ఈ టీజర్ ఓపెనింగ్ లోనే సౌత్ లోనే చాలా సెక్యూర్డ్ జైలు నుంచి తప్పించుకున్నట్లు చూపించారు. ఆ తర్వాత అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఈ క్రమంలోనే అసలు అతను ఎవరు అని తెలుసుకునేందుకు నార్త్ లో ఉండే పోలీసులు ప్రయత్నిస్తారు. అసలు టైగర్ నాగేశ్వరరావు ఎవరు అనే విషయాన్ని మురళీ శర్మ వివరిస్తూ ఉంటాడు. టైగర్ నాగేశ్వరరావు స్టువర్టు పురానికి చెందిన వాడని చెబుతూనే.. అతని ప్రతిభా పాఠవాలను వివరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే రవితేజ పాత్రను వివరించే ఒక డైలాగ్ పెట్టారు.
“నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్లుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచే వాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లుంటే వాడి పరుగుతో ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చేవాడు. ఆర్మీలోకి వెళ్లుంటే వాడి ధైర్యానికి ఒక యుద్ధానే గెలిచేవాడు. కానీ, అన్ ఫార్చునేట్లీ వాడు క్రిమినల్ అయ్యాడు” అంటూ మురళీ శర్మ చెప్పుకొస్తాడు. ఈ ఒక్క డైలాగ్ తోనే రవితేజ పాత్రను వివరించేశారు. ఈ సినిమాలో టైగర్ నాగేశ్వరరావు ఒక తెలివైన, ధైర్యం కలిగిన ఒక క్రిమినల్ అని చెప్పారు. అతను చిన్నప్పటి నుంచి రక్తం తాగుతూ పెరిగాడంటూ పాత్రలో ఉన్న డెప్త్ ని వివరించే ప్రయత్నం చేశారు. ఇంక కథ విషయానికి వస్తే టైగర్ నాగేశ్వరరాను తెలుగు రాబిన్ హుడ్ గా చూపిస్తారని టాక్ ఎప్పటి నుంచో ఉంది. స్టువర్టుపురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టీజర్ విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలివేషన్స్, ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీజర్ లో ముఖ్యంగా రవితేజ, శ్రీకాంత్ విస్సా డైలాగ్స్, జీవీ ప్రకాశ్ కుమార్ బీజీఎం బాగా హైలెట్ అవుతున్నాయనే చెప్పాలి. మరి.. టైగర్ నాగేశ్వరరావు టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.