iDreamPost
android-app
ios-app

రామ్ గోపాల్ వర్మ వ్యూహం సెకెండ్ టీజర్ ఎలా ఉందంటే?

రామ్ గోపాల్ వర్మ వ్యూహం సెకెండ్ టీజర్ ఎలా ఉందంటే?

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా సెకండ్ టీజర్ ని కూడా విడుదల చేశారు. ఆగస్టు 15న ఉదయం 11 గంటలకు ఈ టీజర్ ని ఆర్జీవీ విడుదల చేశారు. వ్యూహం సినిమాని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలను ఈ వ్యూహం సినిమాలో టచ్ చేసే అవకాశం లేకపోలేదు. వైఎస్సార్ మరణం తర్వాత అధికార, ప్రతిపక్షాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి? రాష్ట్ర విభజన ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది? అనే అంశాలను రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో చూపించబోతున్నానని చెప్పారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి ఓపెన్ చేశారు.

వైఎస్సార్ మరణం తర్వాత ప్రతిపక్ష నేతలు ఎలాంటి వ్యూహాలు పన్నారు? గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరెవరు ఎలాంటి పావులు కదిపారు? కేంద్రం లెవల్లో రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన ఘటనలను కూడా ఈ టీజర్ లో చూపించారు. ముఖ్యంగా విభజన సమయంలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎవరి పక్షాన నిలిచారు? అనే ఎన్నో ప్రశ్నలు లేవనెత్తేలా ఈ వ్యూహం టీజర్ సాగింది. ఇందులో లీడ్ రోల్ ప్లే చేస్తున్న పాత్ర చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తోంది. “నిజం తన షూ లేస్ కట్టుకనే సమయంలోనే అబద్ధం ఈ ప్రపంచాన్ని ఒక రౌడ్ వేస్తుంది” అంటూ చెప్పిన మాట ఆలోచింపజేసే విధంగా ఉంది. కల్యాణ్ పాత్రను ఉద్ధేశించి చెప్పిన డైలాగ్ కూడా వైరల్ అవుతోంది. “నేను వెన్నుపోటు పొడవాల్సిన అవసరం లేదు. వాడిని వాడే పొడుచుకుంటాడు” అంటూ చెప్పడం ప్రస్తుత పరిస్థితులను కూడా ఉద్దేశించినట్లు ఉందంటున్నారు. ఈ టీజర్ చూసిన తర్వాత ఆర్జీవీ ఫ్యాన్స్ ఆయనకు అభినందనలు చెబుతున్నారు. తాను నమ్మింది, తనకు తెలిసింది నిర్భయంగా చెప్పడంలో రామ్ గోపాల్ వర్మకు ఎవరూ సాటిరారు అంటూ కామెంట్ చేస్తున్నారు.