iDreamPost
android-app
ios-app

సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన జైలర్.. తొలి ఇండియన్ సినిమాగా..!

  • Published Aug 25, 2023 | 7:12 PM Updated Updated Aug 25, 2023 | 7:12 PM
  • Published Aug 25, 2023 | 7:12 PMUpdated Aug 25, 2023 | 7:12 PM
సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన జైలర్.. తొలి ఇండియన్ సినిమాగా..!

తలైవా క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లు రద్దీగా మారిపోతాయి. ఇటీవల నెల్సన్- రజినీకాంత్ కాంబోలో వచ్చిన జైలర్ సినిమా తలైవా స్టామినా ఏంటో మరోసారి చాటిచెప్పినట్లు అయింది. విడుదలై 15 రోజులు కావొస్తున్న జైలర్ సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదంటే మీరే అర్థం చేసుకోవాలి. జైలర్ మూవీ బాక్సాఫీస్ వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. నిజానికి కొన్ని రికార్డులు మరే సినిమా బ్రేక్ చేయలేదేమో అనే స్థాయిలో ఉంటున్నాయి.

నెల్సన్- రజినీకాంత్- అనిరుధ్ కాంబోలో వచ్చిన ఈ మాస్టర్ పీస్ జైలర్ సినిమాకు ఇంకా ఆదరణ తగ్గలేదు. విడుదలైన రెండు వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే ఉంది. అది కూడా అలా ఇలా కాదు.. చరిత్రలో నిలిచిపోయే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఏ ఉడ్ తీసుకున్నా జైలర్ రికార్డులను టచ్ చేయడం సాధ్యం కాదేమో అనేలా ఉంది పరిస్థితి. తాజాగా జైలర్ సినిమా క్రియేట్ చేసిన రికార్డు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. యంగ్ హీరోలే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సీనియర్లు సైతం ఈ రికార్డు చూసి ఆశ్చర్యపోతున్నారు. తలైవా దెబ్బకు అందరూ షాక్ లో ఉండిపోయారు.

ఇప్పుడు జైలర్ క్రియేట్ చేసిన రికార్డు ఏంటంటే.. నాలుగు మార్కెట్స్ లో రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన నాన్ సీక్వెల్ సినిమాగా చరిత్ర సృష్టించిందని తెలుస్తోంది. ఏపీ/తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక మార్కెట్స్ లో జైలర్ సినిమా రూ.50 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసిందని చెబుతున్నారు. రజినీకాంత్ క్రియేట్ చేసిన ఈ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరు అంటూ తలైవా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చాలాకాలం తర్వాత రజినీకాంత్ కు సరైన సినిమా పడింది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంక కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాని దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించగా.. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దాదాపు రూ.580 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు ఉన్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ లిస్టులోకి జైలర్ సినిమా కూడా చేరిపోయింది. ఫ్యాన్స్ ఇప్పటి నుంచి ఎప్పుడెప్పుడు జైలర్ సినిమా పార్ట్ 2 షూట్ స్టార్ట్ చేస్తారంటూ నెల్సన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు రజినీకాంత్- విజయ్ కాంబోలో సినిమా తీయాలి అనేది తన కల అని నెల్సన్ చెప్పాడు. ఆ కలను ఎప్పుడు నెరవేర్చుకుంటారు అంటూ కూడా ఫ్యాన్స్ నెల్సన్ ను అడుగుతున్నారు. బీస్ట్ సినిమా తర్వాత నెల్సన్- విజయ్ మధ్య మంచి బాడింగ్ ఏర్పడింది. అలాగే రజినీకాంత్ తో నెల్సన్ కు చాలా మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే రజినీ- విజయ్ కాంబోలో ఒక సినిమా తప్పకుండా పడుతుందంటూ ఆకాంక్షిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss