iDreamPost
android-app
ios-app

చంద్రముఖి-2 ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎలా ఉండబోతోంది?

  • Published Sep 03, 2023 | 5:51 PM Updated Updated Sep 03, 2023 | 5:51 PM
  • Published Sep 03, 2023 | 5:51 PMUpdated Sep 03, 2023 | 5:51 PM
చంద్రముఖి-2 ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎలా ఉండబోతోంది?

నాందాండ చంద్రముఖి.. ఈ డైలాగ్ విని ప్రేక్షకులు భయంతో వణికిపోయి దాదాపు 17 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్లీ లకలకలక అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు చంద్రముఖి 2 టీమ్ రెడీ అయిపోయింది. సెప్టెంబర్ 15న వరల్డ్ వైడ్ ఈ సినిమా విడుదల కాబోతోంది. చంద్రముఖి సీక్వెల్ లో రజినీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన కంగనా రనౌత్ నటిచింది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

సాధారణంగా చంద్రముఖి సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. కామెడీ హారర్ జానర్ లో ఈ సినిమాని నిర్మించారు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు అదే ప్లాట్ తో మళ్లీ ఆ కథకు సీక్వెల్ తీశారు. మరి.. పి.వాసు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే.. స్టోరీ లైన్ మాత్రం పార్ట్-1కి దగ్గరగానే ఉంది. ఒక కుటుంబం ఒక విల్లాను కొనుగోలు చేస్తారు. ఆ ఇంట్లో ఒక ఆత్మ ఉంటుంది. అది ఆ కుటుంబంలో ఒకరిని ఆవహించి తన రివేంజ్ తీర్చుకుంటుంది.

చంద్రముఖి-2 స్టోరీ కూడా అలాగే ఉండబోతోందని అర్థమవుతోంది. రెండు పార్ట్స్ లో కామన్ గా ఉన్న యాక్టర్ మాత్రం వడివేలు అని చెప్పచ్చు. ఈసారి మరిన్ని పాత్రలను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. లారెన్స్, కంగనా రనౌత్, రాధిక, రావు రమేశ్ వంటి స్టార్లతో పాటుగా.. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. రజినీకాంత్ వెంకటపతి రాజాగా చేసినప్పుడు కేవలం ఆయనను ఒక పాటలో మాత్రమే రాజుగా చూపిస్తారు. కానీ, ఈసారి వేటయ రాజుతో పోరాట సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఈ ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు అయితే భారీగానే పెరిగాయి. మరి.. చంద్రముఖి 2 సినిమా ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss