iDreamPost
android-app
ios-app

బన్నీ ఫ్యాన్స్ కు ప్రౌడ్ మూమెంట్.. ఇండియాలోనే తొలి యాక్టర్ గా..!

  • Published Aug 29, 2023 | 9:56 PM Updated Updated Aug 29, 2023 | 9:56 PM
  • Published Aug 29, 2023 | 9:56 PMUpdated Aug 29, 2023 | 9:56 PM
బన్నీ ఫ్యాన్స్ కు ప్రౌడ్ మూమెంట్.. ఇండియాలోనే తొలి యాక్టర్ గా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాగా వినిపిస్తున్న పేరు. 69 ఏళ్లకు తెలుగు సినిమా నుంచి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించాడు. దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ పేరు మారు మోగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకున్నారు. అయితే అక్కడితోనే అయిపోలేదు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది డబుల్ ధమాకా అనే చెప్పాలి. తగ్గేదేలే అంటూ రచ్చ రచ్చ చేసే వార్త ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. ఇది నిజంగా బన్నీ ఫ్యాన్స్ కు ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా నేషనల్ అవార్డు రావడంపై సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు ఇంకో సర్ ప్రైజ్ రెడీ అయిపోయింది. ఇది దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా బన్నీ పేరును మారు మోగించే న్యూస్ అనే చెప్పాలి. అంతేకాకుండా ఈ వార్త విన్న తర్వాత కచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా అది సార్ మా హీరో రేంజ్ అంటూ కాలర్ ఎగరేసుకుని తిరుగుతారనే చెప్పాలి. ఇంతలా చెప్పడం ఎందుకంటే బన్నీ సాధించిన ఘనత అలాంటింది మరి. ఇండియాలోనే తొలి యాక్టర్ గా నిలిచాడు మరి.

అల్లు అర్జున్ నుంచి రాబోతున్న సర్ ప్రైజ్ అలాంటి ఇలాంటిది కాదు. అల్లు అర్జున్ ను ఇన్ స్టాగ్రామ్ ప్రతినిధులు కలిశారంట. వాళ్లు బన్నీతో కొన్ని వీడియోస్ షూట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అందులో గొప్పేముది అని కంక్లూజన్ కి రాకండి. ఎందుకంటే ఇన్ స్టాగ్రామ్ ఇండియాలో ఇలా వీడియోలు తీయడం ఇదే మొదటిసారి. ఆ విధంగా చూసుకుంటే భారత్ లో ఉండే బడా బడా స్టార్లకు కూడా ఆ అవకాశం దక్కలేదు మరి. అలాంటి ఛాన్స్ అల్లు అర్జున్ కు దక్కింది. అందుకే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది ప్రౌడ్ మూమెంట్ అని చెబుతోంది. ఇప్పటికే బన్నీ గురువారం ఉదయం 9 గంటలకు ఒక సంథింగ్ స్పెషల్ అప్ డేట్ రాబోతోంది అంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీగా పెట్టాడు.

అల్లు అర్జున్ చెప్పిన ఆ సర్ ప్రైజ్ ఇదేనని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మొత్తానికి నేషనల్ అవార్డుతో ట్రీట్ ఇచ్చిన కొన్ని రోజులకే మళ్లీ ఇన్ స్టాగ్రామ్ అంటూ బన్నీ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. అయితే ఇది ఒక్క అల్లు అర్జున్ కి దక్కిన అవకాశం మాత్రమే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి దక్కిన గౌరవంగా చెబుతున్నారు. ఇంక ఐకాన్ స్టార్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప-2 మీద స్వయంగా బన్నీనే అప్ డేట్ ఇచ్చాడు. ఈసారి పుష్ప 2 నెక్ట్స్ లెవల్లో ఉండబోతోంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. మీరు ఎన్నిఅంచనాలు పెట్టుకున్నా వాటిని మించి ఉంటుంది అనే రేంజ్ లో బన్నీ చెప్పుకొచ్చాడు. ఒక లోకల్ సినిమా గ్లోబల్ గా మారేలా ఉంటుందని బన్నీ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో పుష్ప-2 సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాకుండా పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ లిస్ట్ లో పుష్ప-2 సినిమా టాప్ ప్లేస్ లో ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş