iDreamPost
android-app
ios-app

భోళా శంకర్ నిర్మాత వాట్సాప్ చాట్ వైరల్! ఊహించలేని ట్విస్ట్!

  • Published Aug 14, 2023 | 4:33 PM Updated Updated Aug 14, 2023 | 4:33 PM
  • Published Aug 14, 2023 | 4:33 PMUpdated Aug 14, 2023 | 4:33 PM
భోళా శంకర్ నిర్మాత వాట్సాప్ చాట్ వైరల్! ఊహించలేని ట్విస్ట్!

చిరంజీవి– మెహెర్ రమేష్ కాంబోలో తాజాగా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర్ నిర్మించారు. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కాగా.. నెగెటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశ పరిచింది. అయితే తొలిరోజు మాత్రం ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ, తర్వాతి రోజు నుంచి వసూళ్లు బాగా పడిపోయాయి. మరోవైపు రజినీకాంత్- నెల్సన్ ల జైలర్ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఆ సినిమా వసూళ్లు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ కు చిరంజీవికి చెడిందంటూ.. సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి.

భోళా శంకర్ సినిమా అభిమానులను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై నెగిటివ్ బాకా వైరల్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా బాగా పడిపోయాయి. దాంతో కొన్నిరోజులుగా నెట్టింట కొన్ని పుకార్లు బాగా ప్రచారం అవుతున్నాయి. అవేంటంటే ప్రొడ్యూసర్- చిరంజీవి మధ్య విభేదాలు వచ్చిన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి ప్రొడ్యూసర్ అనిల్ సుంకరను ఇబ్బంది పెడుతున్నారు అంటూ నోటికొచ్చిన మాటలను నెట్టింట ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కాస్తా నిర్మాత అనిల్ సుంకర వరకు వెళ్లాయి. ఆ వ్యాఖ్యలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాంటివి ఏవీ నమ్మకండి అంటూ ప్రొడ్యూసర్ చెబుతున్నారు. అందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా వైరల్ అవుతోంది.

Bhola shanker producer whatsapp chat leak

సర్ రెమ్యూనరేషన్ విషయంలో మీపై వస్తున్న వార్తలు నిజమేనా? అంటూ ఒక అభిమాని నేరుగా అనిల్ సుంకరకు మెసేజ్ చేశాడు. అందుకు ఆయన అలాంటిది ఏమీ లేదు.. నేను ఫ్లైట్ లో అమెరికా వెళ్తున్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ న్యూస్ వైరల్ అవుతోందండి అంటూ అభిమాని చెప్పగా.. “పట్టించుకోవద్దండి.. నేను మెగాస్టార్ చిరంజీవి గారితో మరో సినిమా చేయబోతున్నాను. ఆయన చాలా జెన్యూన్ వ్యక్తి. సినిమాతోనే సమాధానం చెబుతాను” అంటూ నిర్మాత అనిల్ సుంకర రిప్లయ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చాట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అనిల్ సుంకర ఇచ్చిన ఈ సమాధానంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది. ఇకనైనా ఆ ప్రచారాలకు పుల్ స్టాప్ పడుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş