iDreamPost
android-app
ios-app

దొంగ దొరికాడు అంటూ నిత్యా మీనన్ పోస్టు.. వారికి అలర్ట్

  • Published Sep 27, 2023 | 11:54 AM Updated Updated Sep 27, 2023 | 11:54 AM
  • Published Sep 27, 2023 | 11:54 AMUpdated Sep 27, 2023 | 11:54 AM
దొంగ దొరికాడు అంటూ నిత్యా మీనన్ పోస్టు.. వారికి అలర్ట్

తనకు నచ్చిన సినిమాలే చేస్తూ.. విభిన్న కథలతో నటిస్తూ..అలరిస్తోంది నిత్యా మీనన్. రింగు రింగుల జుట్టుతో, ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది ఈ బొద్దుగుమ్మ. పుట్టింది కర్ణాటకలో అయినా.. ఆమె తల్లిదండ్రులదీ కేరళ. అలా మొదలైందితో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుని టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. వివాదాలు కూడా ఆమె చెంతకు చేరవు. ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. కోలీవుడ్‌కు చెందిన ఓ హీరో తనను వేధిస్తున్నాడని, షూటింగ్‌లో తనను ఇబ్బంది పెట్టాడని, కోలీవుడ్‌లో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు వార్తలొచ్చాయి.

ఈ వార్తలు నిత్యా మీనన్ దృష్టికి కూడా వెళ్లాయి. వీటిపై స్పందించారు నిత్య. ఇది అవాస్తవం.. జర్నలిజంలోని కొన్ని వర్గాలు ఇలా దిగజారడం చాలా బాధాకరం. ఇంత కంటే మెరుగైన ఆలోచనలు చేయండి అంటూ పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇ్వవలేదని చెప్పుకొచ్చిన ఆమె.. ఇలాంటి రూమర్లను సృష్టిస్తున్న వారి గురించి తనకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. కొన్ని నిమిషాల్లో మరో పోస్టు చేశారు.  బజ్ బాస్కెట్ చేసిన ఓ ఫేక్ పోస్టును స్క్రీన్ షాట్ తీసి.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అందులో దొంగ దొరికాడు అని..తనకు సమాచారం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

అలాగే మనం ఈ భూమి మీద ఉండేది తక్కువ సమయమే..అయినప్పటికీ.. ఒకరి విషయంలో మరొకరు తప్పు చేయడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దీన్ని నేను ఎందుకు ఎత్తి చూపుతున్నానంటే.. జవాబుదారీతనం మాత్రమే చెడు ప్రవర్తనను ఆపుతుంది. బజ్ బాస్కెట్, యువర్స్ బజ్ బాస్కెట్, లెట్ సినిమా వెబ్ సైట్ లేదా ఇన్ స్టా పేజీలను ఫాలో అయ్యే వారు తప్పును తెలుసుకోండి అని రాసుకొచ్చింది నిత్యా. కాగా, ఆమె నటించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ఈ నెల 28న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş