iDreamPost
android-app
ios-app

బాత్ రూంకి చేరిన తెలుగు సీరియల్స్ ట్రెండ్! లైన్ దాటేస్తున్నారా?

  • Published Sep 23, 2023 | 1:07 PM Updated Updated Sep 23, 2023 | 1:07 PM
  • Published Sep 23, 2023 | 1:07 PMUpdated Sep 23, 2023 | 1:07 PM
బాత్ రూంకి చేరిన తెలుగు సీరియల్స్ ట్రెండ్! లైన్ దాటేస్తున్నారా?

సీరియల్స్ అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి టీవీ సీరియల్స్ లేకుండా రోజు గడవదు. ఆదివారం కూడా సినిమాల ప్లేస్ లో సీరియల్స్ వేయచ్చు కదా.. బుల్లితెర ప్రేక్షకులు కోరుకుంటారు. అలాంటి సీరియల్స్ లో నయా ట్రెండ్ నడుస్తున్న విషయాన్ని మీరు గమనించారా? గతంతో పోలిస్తే.. ఇప్పుడు సీరియల్స్ చాలా మారిపోయాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి మారిపోయాయి కూడా. బుల్లితెర ప్రేక్షకులకు వెండితెర ఎక్స్ పీరియన్స్ ని చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే సీరియల్స్ లో ఇప్పుడు ఏం మారింది అనేది చూద్దాం.

బుల్లితెరలో చాలానే ఫేమస్ సీరియల్స్ ఉన్నాయి. వాటిలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి. ఒక మహిళ కేవలం వంటింటి కుందేలు మాత్రమే కాదు.. తాను తల్చుకుంటే ఇంటిని, సమాజాన్ని ఎంతలా చక్కదిద్దగలదు అనే పాయింట్ మీద ఈ సీరియల్ నడుస్తూ ఉంటుంది. జర్నీలో భాగంగా ఈ సీరియల్ లో కొత్త పాత్రలు రావడం, కథ కొత్త మలుపు తిరిగడం చూస్తూనే ఉన్నాం. కథలో భాగంగా విక్రమ్- దివ్య లైఫ్ లోకి కొత్తగా జానూని తీసుకొచ్చారు. జానూని విక్రమ్ కి కట్టబెట్టి దివ్యను పుట్టింటికి పంపేయాలనేది వాళ్ల ప్లాన్. ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అందుకు జానూ కూడా రెట్టించిన ఉత్సాహంతో సహకరిస్తోంది.

విక్రమ్ బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా.. వాటర్ అయిపోతాయి. దివ్యకి అంతా తెలిసినా కూడా పట్టనట్లు ఉంటుంది. అయితే బయటకు వచ్చేస్తాను.. అనగానే వాటర్ తెచ్చేందుకు వెళ్తుంది. మొత్తం గమనించిన జానూ దివ్యకి బదులు తానే నీళ్లు తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతుంది. దివ్యను పైకి రాకుండా ఆపాలంటూ రాజ్యలక్ష్మికి చెబుతుంది. ఈ గ్యాప్ లో జానూ వాటర్ తీసుకుని బాత్ రూమ్ లోకి వెళ్తుంది. విక్రమ్ కు వీపు కూడా రుద్దుంది. నేను వాటర్ తీసుకురామన్నాను.. వీపు రుద్దమనలేదు అంటూ విక్రమ్ అని కళ్లు తుడుచుకుని జానూని చూస్తాడు. నువ్వేంటి ఇక్కడ అంటూ సీరియస్ గా బయటకు పంపేస్తాడు. అయితే ఒళ్లంతగా నురగతో జానూ బయటకు రావడం దివ్య చూస్తుంది. ఏమో అనుకున్నాను బావ చిలిపి కృష్ణుటు అంటూ జానూ కామెంట్ చేస్తుంది. దివ్య లోపలకు వెళ్లి నీళ్లు కొట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఇక్కడ బుల్లితెర సీరియల్స్ మారిపోయాయి అని ఎందుకు అంటున్నాం అంటే.. గతంలో సీరియల్స్ లో ఇలాంటి సీన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు సీరియల్స్ లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. సీరియల్స్ లో బెడ్ రూమ్ సీన్లు, బాత్ రూమ్ సీన్లు, ముద్దులు వరకు వచ్చేశాయి. ఇప్పుడు ఒక సీరియల్ అని కాదు.. దాదాపు అన్ని సీరియల్స్ లో ఇలాంటి సీన్స్ ఉంటున్నాయి. మరీ ఓవర్ గా కాకపోయినా ఇలాంటి కొన్ని సీన్స్ అయితే సీరియల్స్ లో కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సీన్లను ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ముఖ్యం. మరి.. సీరియల్స్ లో ఇలాంటి సీన్స్ వస్తుడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss