iDreamPost
android-app
ios-app

ఆదివారం నీతోనే డాన్స్ గ్రాండ్ ఫినాలేలో విన్నర్స్ కాబోతోంది వీళ్లే!

  • Published Aug 26, 2023 | 9:31 PM Updated Updated Aug 26, 2023 | 9:31 PM
  • Published Aug 26, 2023 | 9:31 PMUpdated Aug 26, 2023 | 9:31 PM
ఆదివారం నీతోనే డాన్స్ గ్రాండ్ ఫినాలేలో విన్నర్స్ కాబోతోంది వీళ్లే!

నీతోనే డాన్స్ గ్రాండ్ ఫినాలే రానే వచ్చింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఫైనల్ ఎపిసోడ్ ని ప్రసారం చేయబోతున్నారు. అలాగే ఈ గ్రాండ్ ఫినాలేకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్టుగా రాబోతున్నాడు. విజేతలకు విజయ్ ట్రోఫీ అందజేయనున్నాడు. ఇప్పటికే విజేతలు ఎవరు కాబోతున్నారు? అంటూ ప్రోమోలు ప్రసారం చేస్తున్నారు. 11 వారాలుగా సాగుతున్న ఈ షోలో ఎవరు విన్నర్స్ అవుతారు అని ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ జోడీ ఎవరు అనేది నెట్టింట లీకైపోయింది. గెలిచింది వీళ్లే అంటూ చెబుతున్నారు.

నీతోనే డాన్స్ ఫైనల్స్ కు మొత్తం 5 జంటలు చేరుకున్నాయి. వారిలో కేవలం ఒక్క జంటకు మాత్రమే ట్రోఫీ, ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఆ జంట ఎవరు అనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. దానికి సమాధానం కోసం ఆదివారం ప్రసారం అయ్యే గ్రాండ్ ఫినాలే కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, అసలు విన్నర్స్ ఎవరు అనేది నెట్టింట వైరల్ అవుతోంది. ఈ షోలో ఆట సందీప్- జ్యోతీ జంట విజయం సాధించినట్లు చెబుతున్నారు. పైగా వీళ్లు అందుకు సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో హింట్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. నీతోనే డాన్స్ షోలో విన్నర్స్ ఎవరు అవుతారు? అంటూ జ్యోతి అడగ్గా.. గెలిచింది మీరే అని మాకు తెలుసులే అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

కొందరైతే మీరు విజేతలు అయ్యారు కాబట్టేగా ఇలా అడుగుతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే నీతోనే డాన్స్ షోలో ఆట సందీప్- జ్యోతీలకు ట్రోఫీ రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నీతోనే డాన్స్ షోలో ఆట సందీప్ జంట ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్స్, నటరాజ్ మాస్టర్ కూడా ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కానీ, మిగిలిన వారు సీరియల్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. ఆట సందీప్- జ్యోతీలు డాన్స్ ఇరగదీయడంలో  ఎలాంటి ఆశ్యర్యం ఉండదు. కానీ, అమర్ దీప్- తేజశ్వి, నిఖిల్- కావ్య, పవన్- అంజలి జంటలు ప్రొఫెషనల్ డాన్సర్స్ కాకపోయినా ఎంతో కష్టపడ్డారు.

టైటిల్ కోసం ఈ జంటలు బాగా కృషి చేశాయి అంటూ అభినందిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఇదే ప్రశ్న అడుతున్నారు. కొరియోగ్రాఫర్లకు టైటిల్ ఇచ్చి ఏం లాభం అంటూ ప్రశ్నిస్తున్నారు. స్థాయికి మించి ఈ 11 వారాలు కృషి చేసిన వీళ్లకు అన్యాయం చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా విన్నర్స్ అయితే ఆట సందీప్- జ్యోతి అని చెబుతున్నారు. వారికి విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టైటిల్, ప్రైజ్ మనీ అందించినట్లు చెబుతున్నారు. మరి.. ఆట సందీప్- జ్యోతి విన్నర్స్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş