iDreamPost
android-app
ios-app

అనుష్కను చూసి హగ్ చేసుకోవడం నేర్చుకున్నా.. నవీన్ పొలిశెట్టి షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 11:39 AM, Wed - 23 August 23
  • Author Soma Sekhar Published - 11:39 AM, Wed - 23 August 23
అనుష్కను చూసి హగ్ చేసుకోవడం నేర్చుకున్నా.. నవీన్ పొలిశెట్టి షాకింగ్ కామెంట్స్

నవీన్ పొలిశెట్టి.. జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీ మెుత్తాన్ని షేక్ చేశాడు. దీంతో అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే జాతిరత్నాలు మూవీ కంటే ముందే ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో, స్పీచ్ లతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా సీనియర్ హీరోయిన్ అనుష్క తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీని చేస్తున్నారు. ఈ మూవీకి పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క జంటగా తెరకెక్కిన మూవీ ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’. డైరెక్టర్ మహేశ్ బాబు.పి ఈ మూవీని తెరకెక్కించగా.. సెప్టెంబర్ 7న తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా.. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పుడిప్పుడే మెుదలు పెడుతోంది చిత్ర యూనిట్. అందులో భాగంగానే నవీన్ పొలిశెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో అనుష్క గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ఈ జాతిరత్నాలు హీరో.

నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ..”ఈ మూవీ షూటింగ్ స్టార్టింగ్ లో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ పక్కన కలిసి నటించాలంటే అంత సులభం కాదనిపించింది. స్టార్టింగ్ రెండు రోజులు సెట్లో ఆమెతో కాస్త ఇబ్బంది పడ్డాను. తర్వాత రోజు నుంచి అనుష్క నాకు ఎంకరేజ్ మెంట్ ఇవ్వడంతో.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ గా మారిపోయాం. దీంతో ఈ మూవీలో మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది” అని చెప్పుకొచ్చాడు నవీన్ పొలిశెట్టి. అయితే అనుష్క నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని యాంకర్ ప్రశ్నించగా..”అనుష్కను చూసి హగ్ చేసుకోవడం నేర్చుకున్నాను. ఆమె సెట్స్ లో అడుగుపెట్టగానే.. టెక్నీషియన్స్ కు ఓ హగ్ ఇస్తుంది. ఆ కౌగిలింత ఎంతో అభిమానపూర్వకంగా ఉంటుంది. అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్ లో ఇదొక్కటి” అని జాతిరత్నాలు హీరో తెలిపాడు. ఇక ట్రైలర్ లో అనుష్క చేసిన రచ్చ చాలా తక్కువ చూపించారని, సినిమాలో ఆమె చేసిన రచ్చ మామూలుగా ఉండదని నవీన్ చెప్పాడు.

ఇదికూడా చదవండి: ‘కాంతార’కి 8 రెట్ల బడ్జెట్ తో ‘కాంతార 2’! ఎందుకని ఇంత పెంచేశారు?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom