iDreamPost
android-app
ios-app

‘ఖుషి’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య!

  • Published Aug 28, 2023 | 9:15 PM Updated Updated Aug 28, 2023 | 9:15 PM
  • Published Aug 28, 2023 | 9:15 PMUpdated Aug 28, 2023 | 9:15 PM
‘ఖుషి’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య!

సమంత- విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కిన ఖుషీ చిత్రం సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ బ్యూటిఫుల్ లస్ స్టోరీ కోసం తెలుగు ప్రేక్షకులు అంతా తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ తో ప్రేక్షకుల్లో హైప్ పెంచేశారు. ఇంక ప్రమోషన్స్ తో అయితే అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. అది కూడా నాగ చైతన్యకు సంబంధించి. అలాంటి వాటిపై నాగ చైతన్య రియాక్ట్ అయ్యాడు.

అసలు చక్కర్లు కొడుతున్న పుకార్లు ఏంటంటే.. ఇటీవల నాగచైతన్య ఒక సినిమా చూడటానికి థియేటర్ కు వెళ్లాడంట. అక్కడ ఇంటర్వెల్ సమయంలో సమంత- విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా ట్రైలర్ ప్లే చేశారంట. ఆ ట్రైలర్ ని చూడగానే నాగచైతన్య లేచి బయటకు వెళ్లిపోయాడంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమాచారంతో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. నాగ చైతన్య నిజంగానే సినిమా మధ్యలో లేచి వెళ్లిపోయాడా? అంటూ ప్రశ్నలు మొదలు పెట్టారు. ఈ వార్తలు ఆ నోటా ఈ నోటా పడి నాగ చైతన్యకు కూడా చేరాయి. కొన్ని వార్తలు కూడా నాగచైతన్య చదివినట్లు చెప్పుకొచ్చాడు. ఈ పుకార్లపై నాగచైతన్య స్పందించాడు.

నాగచైతన్య ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా స్పందించాడు. “ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొన్ని తెలుగు వెబ్ సైట్స్ వార్తలు నా దృష్టికి వచ్చాయి. వాటిలో నిజం లేదని.. సరిచేయాల్సిందిగా వారికి సూచించాం” అంటూ నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు. నాగచైతన్య ఇచ్చిన రిప్లయ్ తో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. వీళ్లిద్దరూ తమ వైవాహిక బంధానికి 2021లో ముగింపు పలికిన విషయం తెలిసిందే. తాము విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ నిర్ణయాన్ని గౌరవించి.. తమకు ఆ స్పేస్ ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఎవరి జీవితాల్లో వాళ్లు ముందుకెళ్తున్నారు.

ఇంక వీళ్ల కెరీర్ విషయానికి వస్తే.. నాగచైతన్య ఒక రియల్ స్టోరీలో లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. బతుకుతెరువు కోసం గుజరాత్ లోని వీరవల్లుకు వెళ్లిన మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ కథను చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు. 2018లో సముద్రంలో వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డులకు చిక్కిన మత్స్యకారుల్లో ఒకడైన రామారావు జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఇటీవలే మత్స్యకారుల స్వగ్రామాన్ని నాగచైతన్య సందర్శించాడు. వారితో ముచ్చటించాడు. ఇంక సమంత కెరీర్ చూస్తే ఖుషీ సినిమా రిలీజ్ రెడీగా ఉంది. సిటాడెల్ ఇండియన్ వర్షన్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆరోగ్యంపై దృష్టి పెట్టింది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş