iDreamPost
android-app
ios-app

ఆ హీరో.. రా.. అన్నప్పుడు వెళ్లుంటే నా లైఫ్ మరోలా ఉండేది: హీరోయిన్

  • Author singhj Published - 05:11 PM, Fri - 14 July 23
  • Author singhj Published - 05:11 PM, Fri - 14 July 23
ఆ హీరో.. రా.. అన్నప్పుడు వెళ్లుంటే నా లైఫ్ మరోలా ఉండేది: హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎంత టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు రావాలి. వచ్చిన ఛాన్సులను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ తమ ప్రతిభను నిరూపించుకోవాలి. అదృష్టం కలిసొచ్చి సక్సెస్​లు వస్తే ఇక వారిని ఆపడం కష్టం. అయితే కొందరి విషయంలో మాత్రం ఇది వర్కౌట్ కాదు. తమను వెతుక్కుంటూ అవకాశాలు వచ్చినా కొందరు అనవసరంగా కాలదన్నుకుంటారు. తీరా ఛాన్సులు పోయాక ఏం చేయాలో తోచక లబోదిబోమంటారు. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ మోనికా బేడీది కూడా అచ్చం ఇలాంటి స్టోరీనే అని చెప్పొచ్చు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగువారికి కూడా సుపరిచితురాలే.

తెలుగులో హీరో శ్రీకాంత్ సరసన ‘తాజ్​మహల్​’ చిత్రంలో యాక్ట్ చేశారు మోనికా బేడి. ఈ మూవీ మంచి హిట్​గా నిలిచి ఆమెకు ఇక్కడ కూడా క్రేజ్​ను తీసుకొచ్చింది. అందమే అసూయ పడేంత గ్లామర్​తో ఆడియెన్స్​ను కట్టిపడేశారు మోనిక. దీంతో అప్పట్లో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఈ అమ్మడికి ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. తర్వాత కాలంలో బాలీవుడ్​కే పరిమితం అయ్యారు మోనికా బేడీ. అనంతరం పలు వివాదాల వల్ల ఫేమస్ అయిన ఈ అందాల భామ.. బిగ్​బాస్ సీజన్​-2లో పాల్గొని మెప్పించారు. అయితే తన కెరీర్​ స్టార్టింగ్​లో చేసిన పలు తప్పులు, మిస్సయిన ఛాన్సుల గురించి ఆమె ఇటీవల మీడియాతో పంచుకున్నారు.

ఒక ఇంటర్వ్యూలో మోనికా బేడీ తన సినీ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఫస్ట్ టైమ్ డైరెక్టర్ సుభాష్​ ఘాయ్ హోలీ పార్టీకి పిలిస్తే వెళ్లాను. అక్కడ రాకేష్ రోషన్ నన్ను చూసి కొంతసేపు నాతో మాట్లాడారు. ​ఆయన నాకు యాక్టర్​గా మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనే విషయం నాకు తెలీదు. అయితే పార్టీ అయిన తర్వాత రాకేష్ రోషన్ తన విజిటింగ్ కార్డు నా చేతికి ఇచ్చి రేపు ఆఫీస్​కు రా అని చెప్పి వెళ్లిపోయారు. ఆయన నన్ను ఎందుకు రమ్మంటున్నాడు అనుకొని ఆ కార్డును చింపి ముక్కలు చేశాను’ అని మోనికా బేడీ పేర్కొన్నారు.

‘నేను విజిటింగ్ కార్డు చించేసిన కొన్నాళ్లకు నా మేనేజర్ వచ్చి.. రాకేష్ రోషన్ ఆఫీస్​కు పిలిస్తే ఎందుకు వెళ్లలేదని అడిగారు. ఆయన నటుడనే తెలుసు.. నిర్మాత అని తెలియదని చెప్పా. తాను తీస్తున్న ‘కరణ్ అర్జున్’లో సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్​గా నీకు ఛాన్స్ ఇవ్వడానికి పిలిచాడు అని మేనేజర్ చెప్పారు. దీంతో నేను ఒక్కసారిగా షాకయ్యా. ఆయన పిలవగానే వెళ్లుంటే నా లైఫ్ మరోలా ఉండేది’ అని మోనికా బేడీ వ్యాఖ్యానించారు. ఇకపోతే, స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి అయిన రాకేష్ రోషన్.. నటుడిగా ఎన్నో చిత్రాల్లో యాక్ట్ చేశారు. హీరోగానూ పలు మూవీస్​లో నటించారు.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique