iDreamPost
android-app
ios-app

పవన్‌ రాజకీయాలపై మంచు విష్ణు కామెంట్స్‌.. సినిమాలైతే ఓకే కానీ

  • Published Aug 17, 2023 | 12:13 PMUpdated Aug 17, 2023 | 12:13 PM
  • Published Aug 17, 2023 | 12:13 PMUpdated Aug 17, 2023 | 12:13 PM
పవన్‌ రాజకీయాలపై మంచు విష్ణు కామెంట్స్‌.. సినిమాలైతే ఓకే కానీ

మోహన్‌ బాబు కుమారుడు, హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. హీరోగా, మా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మంచు విష్ణు.. భక్త కన్నప్ప సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంచు విష్ణు.. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే పవన్‌ పాలిటిక్స్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకు మంచు విష్ణు ఏమన్నారంటే..

పవన్‌ పాలిటిక్స్‌పై విష్ణు స్పందిస్తూ.. ‘‘ఆయన రాజకీయాల గురించి చెప్పడానికి నేను ఏమైనా బ్రహ్మంగారినా.. పవన్‌ సినిమాల గురించి అయితే చెప్పగలను. సినిమా ఇండస్ట్రీలో ఆయన సూపర్‌ స్టార్‌ డౌట్‌ లేదు. ఒక సినిమా ప్లాఫ్‌ అయినా.. మరో సినిమాతో దాన్ని కవర్‌ చేసుకోవచ్చు. కానీ ఆయన రాజకీయాల గురించి మాత్రం చెప్పలేను. ఎందుకంటే ప్రస్తుతం జనాలు చాలా స్మార్ట్‌గా ఉన్నారు. సినిమా వస్తే చూస్తారు.. కానీ ఓటేయాలనుకున్నప్పుడు మాత్రం.. వాళ్లకి నచ్చిన వారికే ఓటు వేస్తారు’’అని చెప్పుకొచ్చాడు.

‘‘గతంలో సినిమా రంగానికి చెందిన మహానుభావులవంటి వారు ఎందరో రాజకీయాల్లో ఓడిపోయారు. ఒక్కోసారి రాజకీయాల్లో ఎంతో పేరు పొందిన మహానుభావులను కూడా జనాలు ఓడించారు. రాజకీయాల్లో ఎవరైతే తమ గ్రామాన్ని, దేశాన్ని, జీవితాన్నా బాగు చేస్తారని జనాలు నమ్ముతారో.. అలాంటి నాయకుల వైపే ప్రజలు ఉంటారు. మరో ఆరు నెలలు ఆగితే రాజకీయాల్లో​ పవన్‌ భవిష్యత్తు ఏంటనేది చెబుతాను’’ అన్నారు మంచు విష్ణు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి