iDreamPost
android-app
ios-app

క్రేజీ న్యూస్.. పొలిమేర 2 రిలీజ్ అప్పుడే!

క్రేజీ న్యూస్.. పొలిమేర 2 రిలీజ్ అప్పుడే!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న జానర్ హారర్ అనే చెప్పాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు నుంచి హారర్ సినిమాలు బాగా తగ్గిపోయాయి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ఇటీవల విడుదలైన మసూద, విరూపాక్ష విజయాలను చూస్తే చెప్పవచ్చు. అయితే తెలుగు హారర్ సినిమా సెక్షన్ లో ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఒక సినిమా సీక్వెల్ కోసం బాగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమానే పొలిమేర 2. కరోనా వల్ల 2021లో ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ మూవీగా రిలీజ్ చేశారు. కానీ, సీక్వెల్ ని మాత్రం థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమాకి విపరీతమైన ప్రేక్షకాదరణ దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు నేరుగా థియేటర్లలోనే ఈ సీక్వెల్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్టర్, టీజర్ రిలీజే చేశారు. వాటికి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 1 చూసిన వాళ్లంతగా ఇప్పుడు పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులకు మూవీ టీమ్ క్రేజ్ అప్ డేట్ ఇచ్చేసింది. నవంబర్ 2న మా ఊరి పొలిమేర 2 రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూడటానికి ఓ బలమైన కారణం ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Rajesh Satyam (@satyamrajesh7)

పార్ట్ 1 మొత్తం చేతబడులు, కవిత అనే మహిళ మృతి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు భయంకరమైన చేతబడి చేసి చంపేశాడంటూ సత్యం రాజేశ్ ను చంపేందుకు చిత్రం శ్రీను ప్లాన్ చేస్తాడు. ఆ క్రమంలో సత్యం రాజేశ్ చనిపోయాడు అంటూ చూపిస్తారు. కానీ తన అన్న చనిపోలేదని బాలాదిత్య తెలుసుకుంటాడు. పార్ట్ 1 ముంగింపుని పార్ట్ 2 కోసం కర్టన్ రైజర్ గా ఒక చిన్న సీన్ పెట్టి వదిలేశారు. ఆ సీన్ లో చనిపోయింది అనుకున్న కవిత పాత్రను సత్యం రాజేశ్ భార్యగా చూపిస్తారు. దాంతో ప్రేక్షకులకు గట్టి షాకే తగిలింది. ఇప్పుడు ఆ ప్రశ్నతోనే వీళ్లు ప్రమోషన్స్ చేస్తున్నారు. చనిపోయిన కవిత ఎలా తిరిగి వచ్చిందో తెలియాలంటే నవంబర్ 2న థియేటర్లకు వచ్చేయండి అంటూ చెబుతున్నారు. మరి.. మా ఊరి పొలిమేర 2 సినిమా కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.