iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క కారణంతో స్టార్ హీరో సినిమా నుంచి తొలగించారు: ‘లవ్ టుడే’ హీరోయిన్

  • Author Soma Sekhar Published - 05:17 PM, Mon - 7 August 23
  • Author Soma Sekhar Published - 05:17 PM, Mon - 7 August 23
ఆ ఒక్క కారణంతో స్టార్ హీరో సినిమా నుంచి తొలగించారు: ‘లవ్ టుడే’ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారో చెప్పలేం. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నటీ, నటులకు చెప్పుకోదగ్గ పేరు రాకపోవచ్చు. కానీ ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని తనవైపునకు తిప్పుకుంటారు కొంతమంది నటీ, నటులు. అలా ‘లవ్ టుడే’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కేరళ బ్యూటీ ఇవాన. చిన్న చిత్రంగా విడుదలైన లవ్ టుడే మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నిర్మించిన LGM చిత్రంతో మరోసారి తెరపై మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఒకే ఒక్క కారణంతో స్టార్ హీరో సినిమాలో నుంచి తీసేశారని చెప్పుకొచ్చింది.

ఇవాన.. లవ్ టుడే సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచింది. కేరళ అమ్మాయి అయినప్పటికీ అచ్చతెలుగు అమ్మాయిలా నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తొలుత తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం.. తర్వాత తెలుగులో విడుదలై భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. రూ. 60 కోట్ల రూపాయాలను వసూల్ చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రం తర్వాత ఇవానకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నిర్మించిన LGM చిత్రంతో మరోసారి వెండితెరపై సందడి చేసింది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను హైట్ తక్కువగా ఉండటం వల్ల కన్నడలో ఓ స్టార్ హీరో సినిమా నుంచి తొలంగించారని చెప్పుకొచ్చింది ఇవానా. ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా ఇవానా పేర్కొంది. అలాంటి సమయంలో చాలా బాధపడ్డానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా.. స్టార్ హీరోతో సినిమా పూజా కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ఎత్తు తక్కువగా ఉందని ఆ సినిమా నుంచి తొలగించినట్లుగా తెలిపింది.

ఇక లవ్ టుడే సినిమా విషయంలో కూడా ఇవానా బాడీ షేమింగ్ ను ఎదుర్కొనట్లుగా చెప్పుకొచ్చింది. ఇవానా పొట్టిగా ఉండటం వల్ల స్కూల్లో చదువుతున్నప్పుడు అసెంబ్లీ సమయంలో ఆమెనే ముందు వరుసలో నిలబెట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక స్నేహితులు ఎగతాళి చేసినప్పుడు దాని ప్రభావం రోజంతా ఉంటుందని చెప్పుకొచ్చింది. మరి బాడీ షేమింగ్ కు గురైయ్యాను అని చెప్పుకొచ్చిన లవ్ టుడే హీరోయిన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం… గుండె పోటుతో ప్రముఖ నటుడి భార్య మృతి!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş