iDreamPost
android-app
ios-app

సినీ ఇండస్ట్రీలో విషాదం… గుండె పోటుతో ప్రముఖ నటుడి భార్య మృతి!

సినీ ఇండస్ట్రీలో విషాదం… గుండె పోటుతో  ప్రముఖ నటుడి భార్య మృతి!

ఇటీవల తరచూ  సినీ, రాజకీయ రంగాల్లో విషాదం చోటుచేసుకుంటుంది. వివిధ కారణాలతో పలువురు ప్రముఖులు మరణించారు. గుండెపోటు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదం వంటి ఇతర కారణాలతో మరణిస్తున్నారు. ఇలా ప్రముఖల మరణాలు.. వారి కుటుంబాలతో పాటు వారి అభిమానలను విషాదంలోకి నెట్టుతున్నాయి. ఆదివారమే ప్రజా నాయకుడు గద్దర్  అనారోగ్యంతో మరణించారు. దీంతో యావత్తు తెలంగాణ విషాదంలో మునిగిపోయింది. తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు విజయ్ రాఘవేంద్ర  భార్య గుండె పోటుతో మరణించారు.

కన్నడ ఇండస్ట్రీలో ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు విజయ్ రాఘవేంద్ర. ఈయనకు స్పందనతో వివాహం జరిగింది. తాజాగా బ్యాంకాక్ పర్యటనలో ఉన్న విజయ్ భార్య స్పందన అకస్మాత్తుగా వచ్చిన గుండె పోటు రాడవంతో ప్రాణాలు వదిలారు. ఆదివారం రాత్రి స్పందన ఛాతీలో నొప్పి ఉందని తన తోటి వారికి తెలిపింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తొలుత బీపీ తగ్గి, గుండె పోటు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్పందన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. విజయ్ రాఘవేంద్ర కన్నడ సినిమాల్లో నటుడిగా దర్శకుడిగా పని చేశారు.

ఇక విజయ్ రాఘవేంద్ర ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నాడు. ఆయన త్వరలో రిలీజ్ కానున్న కద్దా అనే మూవీ ప్రమోషన్లో బిజీ బీజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగష్టు 25న థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ రాఘవేంద్ర, స్పందనల వివాహం  2007లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్పందన తండ్రి బీకే  శివరామ్ రిటైర్ పోలీస్ అధికారి. ఇక కూతురి మరణవార్త తెలియగానే ఆయన బ్యాంకాక్ బయలుదేరారు. మంగళవారం ఆమె భౌతిక కాయం ఇండియాకు రానుంది. 2016లో ప్రముఖ కన్నడ నటుడు రవిచంద్రన హీరోగా నటించిన ‘అపూర్వ’ సినిమాలో స్పందన యాక్ట్ చేసింది. విజయ్ కి బంధువైన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా 2021 అక్టోబర్ 29న  గుండె పోటుతోనే మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ భార్య మృతితో కన్నడ ఇండస్ట్రీ విషాదంలో మునిగింది. ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఈ నరకం ఏ తల్లికీ రాకూడదు.. మనసు ముక్కలైందంటూ ఏడ్చేసిన హీరోయిన్!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş