iDreamPost
android-app
ios-app

దేవరపై హైప్ పెంచుతున్న కొరటాల.. మరో పాన్ ఇండియా స్టార్..!

  • Published Aug 16, 2023 | 3:23 PM Updated Updated Aug 16, 2023 | 3:23 PM
  • Published Aug 16, 2023 | 3:23 PMUpdated Aug 16, 2023 | 3:23 PM
దేవరపై హైప్ పెంచుతున్న కొరటాల.. మరో పాన్ ఇండియా స్టార్..!

ట్రిపులార్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే ఇది బ్రాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొరటాల చెప్పిన మాటలు అభిమానుల్లో బలంగా నాటుకున్నాయి. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచుతూ కొరటాల భైరా క్యారెక్టర్ లో మరో పాన్ ఇండియన్ స్టార్ ని పరిచయం చేశాడు.

ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా.. సినిమా ప్రేక్షకుల్లో కూడా ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు ఇలాంటి ఒక వైలెంట్ పాత్రను మీరు చూసి ఉండరు అంటూ కొరటాల చెప్పే మాటలు ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీలో ఇంకా పాన్ ఇండియన్ స్టార్ ని పరిచయం చేశారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ఒక కీ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవర పాన్ ఇండియా సినిమా కావడంతో బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఉంటుందని చెప్పక చెప్పాడు.

సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా అతను దేవరలో చేస్తున్న భైరా పాత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. భైరా పాత్ర కూడా ఎంతో క్రూరంగా ఉండబోతోందని ఆ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే సైఫ్ అలీ ఖాన్ చేస్తోంది దేవరలో ప్రతినాయకుడి పాత్రని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొరటాల మాత్రం ఆ పాత్ర ఎలా ఉండబోతోందో మాత్రం ఎక్కడా హింట్ ఇవ్వలేదు. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ లో ప్రతినాయకుడిగా అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే. ప్రభాస్ సినిమా కావడంతో అటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చేశాడు. అందుకే కొరటాలకు కూడా ఈ విషయం ప్లస్ అవుతుందనే చెప్పాలి.

ఎందుకంటే హిందీ వాళ్లే కాకుండా.. అటు తెలుగు ప్రేక్షకులు కూడా సైఫ్ అలీ ఖాన్ ను ఇష్టపడుతారు. ఇంక ఈ సినిమాలో కొరటాల శివ ఎన్ని సర్ ప్రైజ్ లు దాచాడో అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రం కాబట్టి అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ పోస్టర్ ను జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పిక్ కి భైరా.. హ్యాపీ బర్త్ డే సైఫ్ సార్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. పోస్టర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరి.. సైఫ్ అలీ ఖాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş