iDreamPost
android-app
ios-app

Vikram Surya: త‌మ్ముడు దడదడలాడించేశాడు, సూర్యపై కమల్ హాసన్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

  • Published Jun 07, 2022 | 4:49 PM Updated Updated Jun 07, 2022 | 4:49 PM
  • Published Jun 07, 2022 | 4:49 PMUpdated Jun 07, 2022 | 4:49 PM
Vikram Surya: త‌మ్ముడు దడదడలాడించేశాడు, సూర్యపై కమల్ హాసన్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

ద‌టీజ్ క‌మ‌ల్ హాసన్.ఇదీ విక్ర‌మ్ మూవీని చూసిన త‌ర్వాత ఫ్యాన్స్ ఇస్తున్న కితాబు. ఫ‌స్ట్ ఆఫ్ విజ‌య్ సేతుప‌తి, ఫాజిల్ యాక్టింగ్ తో ఇర‌గ‌దీస్తే సెకండ్ ఆఫ్ అంతా క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) స్వాగ్ తో అద‌ర‌గొట్టాడు. ఇక చివ‌ర్లో, సూర్య రావ‌డంతోనే థియేట‌ర్ల‌లో విజిల్. రొలెక్స్ గా సూర్య యాక్టింగ్ సూప‌ర్బ్. అందుకే సినిమా విజ‌యానికి కార‌ణ‌మైన వాళ్లంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన క‌మ‌ల్ హాసన్, సూర్య విష‌యంలో ఎమోష‌న‌ల్ అయ్యాడు.

కోలీవుడ్‌లో రికార్డులు బ‌ద్ధ‌ల‌వుతున్నాయి. తెలుగులోనూ విక్ర‌మ్ బ్లాక్ బస్టర్‌. పెట్టిన దానికి రెండింత‌లు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. చాలా ఏళ్ల త‌ర్వాత డ‌బ్బింగ్ సినిమాకు లాభాలు క‌నిపిస్తున్నాయి. పెద్ద విజయాన్ని తెలుగు ప్రేక్షకులు అందించడంతో కమల్ హాసన్ ముఖంలో ఆనందం క‌నిపిస్తోంది. తెలుగు ఆడియెన్స్‌కు థ్యాంక్స్ చెబుతూ కమల్ హాసన్ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో కాస్త ఎమోష‌న‌ల్ గా క‌నిపించారు క‌మ‌ల్.

‘నమస్కారం. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇప్పుడు మంచి సినిమాగా విక్రమ్‌ని ఆదరించడం ఈ సినిమా చేసుకున్న భాగ్యం. అలాగే పెద్ద హిట్ ఇచ్చి నన్ను ఆదరించడం నా అదృష్టం అంటూనే అనిరుధ్, గిరీష్, అన్బరివ్, ఫిలమిన్ తో పాటు ఈ సినిమాకు పేరు తెలియకుండా పని చేసిన వారందరికీ ఈ విజయంలో భాగం ఉంద‌ని క‌మ‌ల్ చెప్పారు.

ఇక విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్ ల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు క‌మ‌ల్ హాస‌న్. నా తమ్ముళ్లు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, నరేన్ వీరిలానే ప్రతిభ గల సైనికులు సినిమా విజయానికి ముఖ్య కారకుల‌ని క‌మ‌ల్ అన్నారు. ఇక సూర్యను ప్ర‌స్తావిస్తూ, క్లైమాక్స్ మూడు నిమిషాల్లో థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశాడు. తమ్ముడు సూర్య నా మీదున్న ప్రేమతో ఈ రోల్ చేశాడు. దానికి కృతజ్ఞతను మేం ఇద్దరి కలిసి నటించినప్పుడు చూపిస్తాన‌ని చెప్పారు.

డైరెక్టర్ లోకేష్ గురించి గొప్ప‌గా చెప్పారు. తనకి సినిమా మీదున్న ప్రేమ, నా మీదున్న అభిమానం ప్రతీ రోజూ షూటింగ్‌లో ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించేది. ఈ ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సేవకుడు మీ నేను’ అని కమల్ హాసన్ ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌ల‌ను తెలియ‌చేశారు.

 

 

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique