iDreamPost
android-app
ios-app

వీడియో: వెకేషన్ కు Jr.NTR! వైరల్ అవుతున్న ఫొటో!

వీడియో: వెకేషన్ కు Jr.NTR! వైరల్ అవుతున్న ఫొటో!

ట్రిపులార్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్టు దేవర. ఈ మూవీ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ కూడా ఈ సినిమాని శరవేగంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన లుక్స్, ఈ సినిమా స్టోరీ లైన్ అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతానికి దేవర షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న వెకేషన్ కు వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఎయిర్ పోర్టులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఒక చిన్న వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తున్నాడు.. మళ్లీ త్వరలోనే తిరిగి వస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు తారక్ వెళ్తోంది వెకేషన్ కోసం కాదనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. తారక్ విదేశాలకు వెళ్తున్న మాట నిజమే. కానీ, వెకేషన్ కోసం కాదండోయ్.. దుబాయ్ లో జరుగుతున్న సైమా అవార్డ్స్ 2023 కార్యక్రమంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్తున్నాడు. చాలా మంది ఈ విషయం తెలియక తారక్ విదేశాలకు వెకేషన్ కోసం వెళ్తున్నాడు అనుకుంటున్నారు.

సెప్టెంబంర్ 15, 16 తారీఖుల్లో దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సైమా అవార్డ్స్ వేడుక జరగనుంది. ఈ సంవత్సరం సైమా అవార్డ్స్ లో రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్రాక్ బస్టర్ చిత్రిం ట్రిపులార్ 11 కేటగిరీల్లో నామినేట్ అయింది. ఆ వేడుకలో పాల్గొనేందుకు తారక్ బయల్దేరి వెళ్లాడు. ట్రిపులార్ తర్వాత హను రాఘవపూడి దర్శవకత్వలో దుల్కర్ సల్మాన్- మృణాళ్ ఠాకూర్ నటించిన సీతా రామమ్ సినిమా 10 కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ వేడి రీత్యా.. తారక్ పై లేనిపోని ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని రూ.371 కోట్ల స్కామ్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

చంద్రబాబు అరెస్టుపై ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆయన దేవర సినిమా షూటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తారక్ పై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కావాలనే చంద్రబాబు అరెస్టుపై మౌనం పాటిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలకు కూడా కావాలనే రాలేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం తారక్ కు మద్దతుగా నిలుస్తున్నారు. తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని.. ఆయన కేవలం తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. రాజకీయాల్లో లేని వ్యక్తిని.. రాజకీయం గురించి మాట్లాడని ఎందుకు అడుగుతున్నారు అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా జూనియర్ ఎన్టీఆర్ ఏంటో తమకు తెలుసు అంటూ మద్దతు పలుకుతున్నారు. మరి.. సైమా అవార్డ్స్ లో ట్రిపులార్ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వస్తాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.