iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గుడ్ న్యూస్.. తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గేమ్ ఆఫ్ థ్రోన్స్.. వరల్డ్ టెలివిజన్ చరిత్రలోనే ఈ టెలివిజన్ షోకి ఉన్న పాపులారిటీ మరే షోకి లేదనే చెప్పాలి. 2011 నుంచి 2019 వరకు హెచ్బీవో ఛానల్ లో ప్రసారం చేశారు. ఆ తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి వచ్చిన ఆదరణ దృష్య్టా దానిని వెబ్ సిరీస్ రూపంలో నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేశారు. కేవలం గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసేందుకే.. నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్స్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వీరాభిమానులకు గుడ్ న్యూస్ అందింది.

ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో గేమ్ ఆప్ థ్రోన్స్ వెబ్ సిరీస్ కు ఎంతో మంచి ఆదరణ లభించింది. GOT వీక్స్ అంటూ ఫ్రెండ్స్ తో కలిసి నైట్ అవుట్ చేసి మరీ ఈ సిరీస్ లు చూస్తుండేవాళ్లు. ఇప్పటికీ ఈ వెబ్ సిరీస్ ని రిపీటెడ్ గా చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఉంటారు. అయితే ఈ వెబ్ సిరీస్ చూసేందుకు చాలా పెద్ద అడ్డంకి ఏంటంటే.. భాష. తెలుగులో ఈ వెబ్ సిరీస్ లేదని ఎంతో మంది బాధ పడుతుండేవారు. అయితే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తెలుగులో రాబోతోంది. అవును మీరు వింది నిజమే.. తెలుగులో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది.

నెట్ ఫ్లిక్స్ తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ట్రీమింగ్ పార్టనర్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అమెజాన్ లో ఈ వెబ్ సిరీస్ లేదు. ఆ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా దక్కించుకుంది. అంతేకాకుండా భారతీయ GOT ఫ్యాన్స్ కు చాలా మంచి శుభవార్త చెప్పింది. అదేంటంటే జియో సినిమాలో స్ట్రీమ్ అవ్వడమే కాకుండా.. ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ కానుంది. అతి త్వరలోనే ఈ భాషల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ట్రీమ్ అవుతుందని చెబుతున్నారు. ఈ వార్త వినగానే పాన్ ఇండియా లెవల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. సబ్ టైటిల్స్ తో సంబంధం లేకుండా వారికి నచ్చిన భాషలో చూసేయచ్చు. ఎప్పుడెప్పుడు జియో సినిమా రీజనల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ చేస్తుందని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయమే వైరల్ అవుతోంది.