iDreamPost
android-app
ios-app

NTRతో కలిసి నటించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా?

  • Author Soma Sekhar Published - 09:30 PM, Fri - 11 August 23
  • Author Soma Sekhar Published - 09:30 PM, Fri - 11 August 23
NTRతో కలిసి నటించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా?

సినిమా ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తుంటారు. ఇక పాత హీరోయిన్లు అవకాశాలు రాక
ఇండస్ట్రీ వదిలి పోతుంటారు. కాగా.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయాక కొంత మంది తిరిగి పరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. మరికొందరేమో పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అవుతుంటారు. అయితే హీరోయిన్ గా వెండితెరపై వారిని చూసిన మనం తర్వాత చూస్తే మాత్రం అస్సలు గుర్తుపట్టలేం. ప్రస్తుతం పై ఫొటోలో కనిపిస్తున్న ఒకప్పటి హీరోయిన్ మీరు గుర్తుపట్టారా? ఆమె తెలుగులో సినిమాలు కూడా చేసిందండీ బాబూ. అదీకాక జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాలో కూడా చేసింది.

పై ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్ పేరు మంజరి ఫడ్నిస్. తెలుగులో అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకులం’ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ ఈ బ్యూటీ అందానికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగులో ఇంకోసారి, సుభద్రాపురం సినిమాలతో పాటుగా ఎన్టీఆర్-మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన ‘శక్తి’ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో.. మరో ఛాన్స్ రాలేదు. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె సింగిల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఈమె పిక్స్ చూసిన నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. అప్పట్లో ఎలా ఉండేవారు.. ఇప్పుడు ఇలా అయ్యారు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఈ అమ్మడు ఫొటో చూడగానే గుర్తుపట్టారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis)


ఇదికూడా చదవండి: మెగాస్టార్ ‘భోళా శంకర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?