iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆలస్యం కానున్న ‘సలార్’!

  • Author Soma Sekhar Published - 05:49 PM, Fri - 1 September 23
  • Author Soma Sekhar Published - 05:49 PM, Fri - 1 September 23
ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆలస్యం కానున్న ‘సలార్’!

‘సలార్’.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండటంతో పాటుగా.. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ ఊరమాస్ లుక్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక సలార్ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించాయి. ఇక షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుండటంతో.. సినిమా అనుకున్న తేదీకి విడుదల అవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం అనుకున్న తేదీకి సలార్ రిలీజ్ కాకపోవచ్చిన తెలుస్తోంది. ఈ న్యూస్ తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు. ఇంతకీ సలార్ రాక ఆలస్యానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా మూవీలు చేస్తున్నాడు. అందులో ఒకటి ‘సలార్’. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, మూవీ నుంచి విడుదలైన డార్లింగ్ లుక్, గ్లింప్స్ పూనకాలు తెప్పించడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. దీంతో ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోను తెరపై చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే? అనుకున్న టైమ్ కు సలార్ థియేటర్లలోకి రాకపోవచ్చని. దానికి కారణం సీజీ వర్క్ పట్ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంతృప్తిగా లేడట. కొన్ని సన్నివేశాలు బాగా రాకపోవడంతో.. వాటిని మళ్లీ సీజీ వర్క్ కు పంపించినట్లు సమాచారం.

ఇక తిరిగి సీజీ వర్క్ కు పంపిన ఆ సీన్లు రావడం బట్టి.. సలార్ విడుదల డేట్ ఉంటుందని తెలుస్తోంది. అదీకాక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిన్న షాట్ ను కూడా చాలా ఎఫెక్టీవ్ గా చూపిస్తాడు. ఇది అతడి గత సినిమాలను బట్టి చూస్తేనే అర్ధం అవుతుంది. మరి అలాంటి డైరెక్టర్ సీజీ వర్క్ లో అసంతృప్తికి గురైయ్యాడు అంటే మామూలు విషయం కాదు. పైగా ఈ మూవీలో ప్రభాస్ ను ఇదివరకు ఎన్నడూ చూడని రేంజ్ లో చూపిస్తానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. దీంతో ప్రతీ విభాగంపై చాలా కేర్ తీసుకుంటున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఏ సినిమాలోనైనా సీజీ వర్క్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ వర్క్ సరిగ్గా లేకపోతే.. సినిమా చూసిన ఫీల్ ఉండదు. దీంతో ఆ ఫీల్ కాస్తా మూవీ రిజల్ట్ పై పడుతుంది. అందుకే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంత కేర్ తీసుకుంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఈ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన, మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయని తెలుస్తోంది.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş