iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్! గోపీచంద్ ను తిట్టడం తప్పే అంటూ..!

  • Author Soma Sekhar Updated - 04:31 PM, Sat - 2 September 23
  • Author Soma Sekhar Updated - 04:31 PM, Sat - 2 September 23
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్! గోపీచంద్ ను తిట్టడం తప్పే అంటూ..!

డైరెక్టర్ ఎ.ఎస్ రవికూమార్.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన పేరు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి హీరోయిన్ మన్నారా చోప్రాను ముద్దుపెట్టుకోవడం, రెండోది మ్యాచో స్టార్ హీరో గోపీచంద్ ను తిట్టడం. ఈ రెండు కారణాలతో న్యూస్ లో నిలిచాడు ఈ డైరెక్టర్. గోపీచంద్ తో ‘యజ్ఞం’, ‘సౌఖ్యం’ లాంటి సినిమాలు తీసి అతడికి హిట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బాలయ్యతో వీరభద్ర మూవీ తీసి ఇండస్ట్రీ నుంచి కనుమరుగైయ్యాడు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ‘తిరగబడరాసామీ’ మూవీతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ఎ.ఎస్ రవికుమార్ హీరో గోపీచంద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో డైరెక్టర్ పై గోపీచంద్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బూతులతో రెచ్చిపోయారు. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చాడు డైరెక్టర్.

రాజ్ తరుణ్ హీరోగా ‘తిరగబడరాసామి’ మూవీతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ డైరెక్టర్ ఎ.ఎస్ రవికుమార్. అయితే రీ ఎంట్రీలోనే వివాదాల్లో చిక్కుకున్నాడు ఈ డైరెక్టర్. తొలుత మూవీ ఫంక్షన్ లో హీరోయిన్ మన్నారా చోప్రాను ముద్దు పెట్టుకుని వార్తల్లో నిలిస్తే.. ఆ వెంటనే స్టార్ హీరో గోపీచంద్ ను అసభ్యంగా తిట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ ఇంటర్వ్యూలో గోపీచంద్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు ఈ డైరెక్టర్. దీంతో రంగంలోకి దిగారు గోపీచంద్ ఫ్యాన్స్. తమ హీరోని నోటికొచ్చినట్లు తిడితే ఊరుకునేది లేదని, సరైన రీతిలో బుద్ధి చెబుతామని సోషల్ మీడియాతో పాటుగా.. డైరెక్ట్ గా ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా మాట్లాడే వారికి ఏ హీరో అవకాశాలు ఇస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చాడు డైరెక్టర్ రవికుమార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన..”గోపీచంద్ తో నాకు ఎలాంటి గొడవా లేదు. అతడు నాకు బిడ్డతో సమానం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అతడిపై చేసిన వ్యాఖ్యల వల్ల రిగ్రేట్ ఫీల్ అవుతున్నా.. గోపీచంద్ ను అలా తిట్టడం తప్పే.. నా వల్ల హర్ట్ అయిన గోపీచంద్ ఫ్యాన్స్ కు నా క్షమాపణలు. ఫ్యాన్స్ నాకు ఫోన్లు చేస్తున్నారు, ఇంతటితో వదిలేయండి” అంటూ డైరెక్టర్ ఎ.ఎస్ రవికుమార్ చెప్పుకొచ్చాడు. అయితే అతడు క్షమాపణలు చెప్పినప్పటికీ అతడిపై గోపీచంద్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. కాగా.. ఈ వివాదంపై ఇంతవరకు గోపీచంద్ స్పందించలేదు. మరి ఇప్పటికైనా గోపీచంద్ స్పందిస్తాడో లేదో చూడాలి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom