సలార్ కోసం దిల్ రాజు భారీ రిస్క్! ఆ గుండె ధైర్యానికి హ్యాట్సఫ్!

  • Author Soma Sekhar Updated - 04:57 PM, Tue - 29 August 23
  • Author Soma Sekhar Updated - 04:57 PM, Tue - 29 August 23
సలార్ కోసం దిల్ రాజు భారీ రిస్క్! ఆ గుండె ధైర్యానికి హ్యాట్సఫ్!

దిల్ రాజు.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కథను బట్టి హిట్టో.. ఫట్టో తేల్చి చెప్పేయగల సమర్థుడిగా దిల్ రాజుకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఇక అతడు సినిమా తీశాడు అంటే ఆ సినిమా దాదాపు హిట్ అనేంత నమ్మకం పరిశ్రమలో ఉంది. మరి అలాంటి దిల్ రాజు ఓ భారీ రిస్క్ చేయబోతున్నాడు. అవును ‘సలార్’ కోసం దిల్ రాజు ఇప్పటి వరకు తన కెరీర్ లో చేయని భారీ రిస్క్ ను తీసుకోబోతున్నారు. దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఇండస్ట్రీ మెుత్తం షాక్ కు గురవుతోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

‘సలార్’ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం. ఇద్దరు హేమాహేమీల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అదీకాక ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సంబంధించిన చేసిన కామెంట్స్.. సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇదివరకు ఎన్నడూ చూడని ప్రభాస్ ను మీరు సలార్ లో చూస్తారని ప్రశాంత్ నీల్ చెప్పాడు. ఇక డార్లింగ్ సైతం నేను ఈ మూవీలో క్రూరంగా కనిపిస్తానని, ఇంతకు ముందెన్నడూ నన్ను ఇలా చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చే అంటున్నారు.

ఇదిలా ఉండగా.. సలార్ థియేట్రికల్ రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ఏంటంటే? ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సలార్ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు భారీ ధరకు కోట్ చేశారట. సలార్ నైజాం రైట్స్ కోసం దిల్ రాజు ఏకంగా రూ. 65 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్, రూ. 15 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ కోట్ చేశాడట. దీంతో ఈ విషయం తెలిసిన సినిమా పండితులు దిల్ రాజు భారీ రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. దానికి కారణం ప్రభాస్ గత చిత్రం ‘ఆదిపురుష్’ పరాజయం పాలవడమే.

అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కావడం, ప్రభాస్ లుక్ ఊరమాస్ గా ఉండటం.. సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో దిల్ రాజు సైతం ఈ సినిమాపై ఎంత ఖర్చు పెట్టినా.. రాబట్టుకోవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. అందుకే ఇంత పెద్ద మెుత్తంలో హక్కుల కోసం కోట్ చేశారు. దిల్ రాజు ఏదీ ఆలోచించకుండా చేయరు అంటూ కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే.. సలార్ ఓవర్సిస్ హక్కుల ధర కోసం భారీ మెుత్తంలో ఫిక్స్ చేశారని సమాచారం. ఓవర్సిస్ హక్కుల కోసం ఏకంగా రూ. 70 కోట్లు ఫిక్స్ చేశారట. అంటే సలార్ ఓవర్సిస్ లో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఏకంగా 9 మిలియన్ డాలర్లను రాబట్టాల్సిన అవసరం ఉంది.

గతంలో ఈ రేంజ్ రేట్ బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు కోట్ చేశారు. మళ్లీ ఇప్పుడు సలార్ మూవీకి చేశారు. కాగా.. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ నుంచి హోంబలే ఫిల్స్మ్ సంస్థ రూ. 200 కోట్లను రాబట్టాని చూస్తున్నట్లు సమాచారం. మరి రిలీజ్ కు ముందే ఈ రేంజ్ హిస్టరీ క్రియేట్ చేస్తున్న సలార్.. రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో రికార్డులు కొల్లగొడుతుందో వేచిచూడాలి. మరి సలార్ విషయంలో దిల్ రాజు చేస్తున్న రిస్క్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఇక మొహమాటం లేదు! నో చెప్పేస్తున్న మెగాస్టార్!

Show comments