iDreamPost
android-app
ios-app

Jr NTR: అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతున్న దేవర.. అమెరికాలో సూపర్ రికార్డు!

  • Published Sep 07, 2024 | 12:27 PM Updated Updated Sep 07, 2024 | 12:57 PM

Devara: జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్నపాన్ ఇండియా సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

Devara: జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్నపాన్ ఇండియా సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

  • Published Sep 07, 2024 | 12:27 PMUpdated Sep 07, 2024 | 12:57 PM
Jr NTR: అడ్వాన్స్  బుకింగ్స్ లో దూసుకుపోతున్న దేవర.. అమెరికాలో సూపర్ రికార్డు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్నపాన్ ఇండియా సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఊపేస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మూడు పాటలు రిలీజ్ కాగా వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ ని వేగం చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తో ప్రమోషన్స్ ని ఆసక్తిగా చేయనున్నారని తెలుస్తుంది. సెప్టెంబర్ 10న దేవర మూవీ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

ముంబైలో ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని తెలుస్తుంది. అందుకోసం భారీ ఎత్తున ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ ఇంకా పెరిగింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కూడా ఆయనకు అభిమానులు పెరిగిపోతున్నారు. ఎన్టీఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో దేవరపై హెవీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా బిజినెస్ దాదాపు 400 కోట్ల దాకా జరిగిందని సమాచారం తెలుస్తుంది. మొదటి రోజు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఇదిలా ఉంటే నార్త్ అమెరికాలో దేవర మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ చేశారని సమాచారం. స్పెషల్ ప్రీమియర్స్ షోలకి బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి అత్యంత వేగంగా ఏకంగా 15000 పైగా టికెట్లు బుక్ అయ్యాయట. ఇప్పటి దాకా ఇంత వేగంగా ఏ ఇండియన్ సినిమాకి టికెట్స్ బుక్ కాలేదని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇంకా గ్రోత్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మొదటి రోజు దేవర సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల పైగా కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom