Dharani
Dharani
లేటెస్ట్ తెలుగు సినిమాలు, మరీ ముఖ్యంగా ఓటీటీ కంటెంట్‌ను ఫ్రీగా చూడాలనుకునే వారికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఐబొమ్మ. అనతి కాలంలోనే ఈ సైట్ విపరీతమైన క్రేజ్, పాపులారిటీ సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా.. ఏ ఓటీటీ కంటెంట్ అయినా సరే.. ఫ్రీగా చూడాలంటే.. ఐబొమ్మనే. మరి ఈ వీడియో స్ట్రీమింగ్ సైట్.. సేఫా.. కాదా అంటే.. సైబర్ నిపుణులు ఏం చేబుతున్నారో తెలియాలంటే ఇది చదవండి. మూవీ రూల్స్, తమిళ్ టోరెంట్స్ మాదిరిగానే ఐబొమ్మ కూడా సురక్షితం కాదు అంటున్నారు. వీటి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే అని అంటున్నారు. దీని వల్ల సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు, సైబర్ ఎక్స్‌పర్ట్స్.
ఐబొమ్మ సైట్ ఓపెన్ చేయగానే.. కుప్పలుతెప్పలుగా యాడ్స్ ప్లే అవ్వడం మీరు గమనించే ఉంటారు. ఒక వేళ మన బ్రౌసర్‌లో యాడ్ బ్లాక్ లాంటి ఎక్స్‌టెన్షన్ ఎనేబుల్లో ఉంటే.. వాటిని డిసేబుల్ చేసే వరకు సైట్ ఓపెన్ కాదు అనే విషయాన్ని కూడా మీరు గమనించే ఉంటారు. ఇక తాజాగా పలువురు టెకీలు.. తమ బ్లాగ్‌లు, సోషల్ మీడియా అకౌంట్లలో ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఐబొమ్మ సైట్ ఒపెన్ చేసినప్పుడు.. లేదంటే మనకు కావాల్సిన మూవీ మీద క్లిక్ చేసినప్పుడు.. ఇలాంటి యాడ్స్ రన్ అవుతుండగా.. మీరు గనక పొరపాటున వాటి మీద క్లిక్ చేస్తే.. ఆ పేజీల్లోకి ఆటోమేటిక్‌గా రీ డైరెక్ట్ అవ్వడం ఐబొమ్మలో ఎక్కువైందని.. ఇదే ఇప్పుడు డేంజర్‌గా మారిందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యాడ్స్ మీద కానీ.. అవి ప్లే అవుతుండగా.. వాటి మీద క్లిక్ చేసినా.. రీడైరెక్ట్ అయ్యే సైట్లు ప్రమాదమని.. వాటి వల్ల.. మన మొబైల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లలో.. హార్మ్ ఫుల్ మాల్వేర్ ఎటాక్ చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దాంతో పాటే.. మన డాటా, బ్రౌజింగ్ హిస్టరీ.. కూడా థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళుతుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలానే ఐబొమ్మ వాడడం డేంజర్ అని అంటున్నారు. అది అన్‌సేఫ్ అని స్పష్టం చేస్తున్నారు.