iDreamPost
android-app
ios-app

Bhola Shankar భోళా శంకర్ లో యంగ్ హీరో

  • Published Jun 13, 2022 | 2:54 PM Updated Updated Jun 13, 2022 | 2:55 PM
  • Published Jun 13, 2022 | 2:54 PMUpdated Jun 13, 2022 | 2:55 PM
Bhola Shankar భోళా శంకర్ లో యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ షూటింగ్ అతి త్వరలోనే పునఃప్రారంభం కానుంది. అజిత్ తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మీద డైరెక్టర్ ట్రాక్ రికార్డు వల్ల అభిమానులు ముందు నుంచి టెన్షన్ గానే ఉన్నారు. దానికి తోడు ఇటీవలే ఆచార్య దారుణంగా డిజాస్టర్ కావడంతో దీని మీద అంచనాల బరువు పెరుగుతోంది. గాడ్ ఫాదరే ముందు విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ అది పొలిటికల్ మూవీ. అందరిని టార్గెట్ చేయగలదా అంటే చెప్పలేం. అందుకే ఊర మాస్ కంటెంట్ ఉన్న భోళా శంకర్ మీద క్రమంగా ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది.

ఇందులో కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక యువ హీరో ఈ టీమ్ తో జాయినవ్వబోతున్నాడని టాక్. అతను ఎవరో కాదు. నితిన్. కీర్తి సురేష్ భర్త లేదా ప్రియుడిగా చాలా ముఖ్యమైన పాత్రను తనకు ఆఫర్ చేసినట్టు వినికిడి. ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టేనని అంటున్నారు. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. క్యారెక్టర్ ఎలా ఉన్నా ఒక గొప్ప మెమరీ కోసం నితిన్ ఒప్పుకున్నట్టు తెలిసింది. ఎలాగూ కీర్తితో కలిసి రంగ్ దే చేశాడు కాబట్టి జోడి మీద డౌట్ అక్కర్లేదు. అయితే మెహర్ రమేష్ మాత్రం భోళా శంకర్ ని ఎలాగైనా సరే హిట్టు కొట్టే తీరాలనే టార్గెట్ తో చేస్తున్నట్టు యూనిట్ వర్గాల సమాచారం.

ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సైరా తర్వాత మెగాస్టార్ తో జట్టు కట్టడం ఇది రెండో సారి. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ కు ఇది భారీ ప్రాజెక్టు. ఆచార్యలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిరాశపరిచిన మహతి దీంతో ప్రూవ్ చేసుకోవాల్సన అవసరం చాలా ఉంది. ఈ మధ్య చిరంజీవి తన సినిమాల్లో ఇంకో హీరో సపోర్ట్ ఉండేలా చూసుకుంటున్నారు. గాడ్ ఫాదర్ లో సత్యదేవ్, వాల్తేర్ వీరయ్యలో రవితేజ, భోళా శంకర్ లో నితిన్ నెక్స్ట్ వెంకీ కుడుముల ప్రాజెక్టులో సైతం ఎవరో ఒకరు ఉండే ఉంటారు. నెల రోజుల పాటు విదేశీ ట్రిప్ వెళ్లొచ్చిన చిరు ఇకపై వరస షెడ్యూల్స్ తో బిజీ కాబోతున్నారు. గాడ్ ఫాదర్ రిలీజ్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş