iDreamPost
android-app
ios-app

Bro Daddy : మెగా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న డాడీ

  • Published Mar 19, 2022 | 4:21 PM Updated Updated Mar 19, 2022 | 4:21 PM
  • Published Mar 19, 2022 | 4:21 PMUpdated Mar 19, 2022 | 4:21 PM
Bro Daddy : మెగా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న డాడీ

ఆ మధ్య మలయాళంలో బ్రో డాడీ అనే సినిమా డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకుంది. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆ మూవీలో పృథ్విరాజ్ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. హిట్ అనిపించుకునే స్థాయిలో స్పందన దక్కించుకుంది. సబ్ టైటిల్స్ సహాయంతో మనవాళ్ళు కూడా బాగానే చూశారు. ఇప్పుడీ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారనే వార్త అభిమానులను ఖంగారు పెడుతోంది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ లీకైన సోర్స్ వల్ల సోషల్ మీడియాలో ఈ టాక్ గట్టిగానే తిరుగుతోంది. నిజానికది మాస్ ఎంటర్ టైనర్ కాదు. సాఫ్ట్ కామెడీతో సాగే ఒక సెన్సిటివ్ సబ్జెక్టు. అందుకే వర్రీ.

ఆల్రెడీ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, వేదాళం రీమేక్ భోళా శంకర్ తో చిరు రెండు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మూడోది అంటే సమయం ఆదా అవుతుందేమో కానీ రిస్క్ కోణంలో చూసుకుంటే ఇది అంత సులభంగా ఫ్యాన్స్ కి నచ్చే జోనర్ కాదు. లేటు వయసులో తండ్రి కాబోయే క్యారెక్టర్ గా మోహన్ లాల్ చాలా బాగా చేశారు. డీల్ చేయడం అయితే బాగానే జరిగింది కానీ అక్కడి ఆడియన్స్ అభిరుచులు వేరు కాబట్టి వాళ్లకు నచ్చింది. కానీ మనం అలా కాదు. అందులోనూ మెగాస్టార్ ని అలాంటి పాత్రలో చూడటం కష్టం. మరి ఈ బ్రో డాడీ నిజంగా తెరకెక్కుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. హక్కులు ఎవరు కొన్నారో క్లారిటీ లేదు.

అయినా మెగా బ్రదర్స్ ఇద్దరూ ఇలా రీమేకుల క్యూ కట్టడం అభిమానులకు అంతగా రుచించడం లేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత పవన్ మళ్ళీ వినోదయ సితంకు ఓకే చెప్పాడు. తేరి రీమేక్ కూడా లైన్ లో ఉందట. ఇవన్నీ ఓటిటి జనాలు ఎప్పుడో చూసేశారు. తిరిగి తీయడం అంటే పారితోషికాలు మార్కెట్ కోసం తప్ప మరో కారణం కాదు. మలయాళంలో ఆడిన ప్రతి సినిమా ఇక్కడ అదే రిజల్ట్ అందుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఏదో ఒకటి రెండు చేస్తే ఓకే కానీ ప్రాధాన్యత వాటికే ఇస్తూ పోవడం కరెక్ట్ కాదు. మరి ఈ బ్రో డాడీ టాక్ అబద్దమైతే బాగుండని కోరుకుంటున్న ఫ్యాన్స్ ఆకాంక్షకు తగ్గట్టు గాసిప్ అవుతుందో లేదో చూద్దాం

Also Read : RRR : అభిమానులు కోరుకున్నది జరిగింది కానీ

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş