iDreamPost
android-app
ios-app

లెజెండరీ హీరో ఇల్లు అమ్మకం.. ఏకంగా రూ. 400 కోట్లకు

  • Author Soma Sekhar Published - 01:52 PM, Thu - 21 September 23
  • Author Soma Sekhar Published - 01:52 PM, Thu - 21 September 23
లెజెండరీ హీరో ఇల్లు అమ్మకం.. ఏకంగా రూ. 400 కోట్లకు

ఇండస్ట్రీలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? ఓ లెజెండరీ యాక్టర్ కు చెందిన ఇల్లును రూ. 400 కోట్లకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుగోలు చేసిందని, దాని స్థానంలో ఓ భారీ బహుళ అంతస్థుల భవనం నిర్మించబోతుందన్న వార్తలు బీ టౌన్ లో గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ దివంగత నటుడు దేవానంద్ కు చెందిన ఓ ఖరీదైన ఇంటిని అమ్మినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దేవానంద్ డ్రీమ్ హౌస్ ముంబైలోని జుహు బంగ్లాని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ రూ. 400 కోట్లకు విక్రయించినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై దేవానంద్ మేనల్లుడు, నిర్మాత కేతన్ ఆనంద్ తాజాగా స్పందించారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దివంగత దేవానంద్ కు చెందిన లగ్జరీ బంగ్లాను రూ. 400 కోట్లకు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుగోలు చేసిందన్న వార్తలు బాలీవుడ్ మీడియాలో హల్ చల్ చేశాయి. ముంబైలోని జుహు లో ఉన్న బంగ్లాను తన డ్రీమ్ హౌస్ గా దేవానంద్ గతంలో ఎన్నో సార్లు చెప్పారు. దాదాపు 40 ఏళ్ల పాటు దేవానంద్ తన భార్య కల్పనా కార్తీక్, పిల్లలు సునీల్ ఆనంద్, దేవినా ఆనంద్ లతో కలిసి అక్కడ జీవితం గడిపారు. అలాంటి అనుబంధం ఉన్న ఇల్లును అమ్మారని, డీల్ కూడా పూర్తి అయ్యిందని, పేపర్ వర్క్ జరుగుతుందంటూ న్యూస్ వైరల్ గా మారింది.

ఈ వార్తలపై తాజాగా దేవానంద్ మేనల్లుడు కేతన్ ఆనంద్ స్పందించాడు. ఇల్లు అమ్మే ఉద్దేశమే లేదని, అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశాడు. అందరి కుటుంబ సభ్యులను అడిగే ఈ విషయం వెల్లడిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక జుహు ప్రాంతంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో పాటు సినీ సెలబ్రిటీలు ఉంటారు. ఈ వార్తలపై దేవానంద్ మేనల్లుడు స్పందించడంతో.. రూమర్స్ కు చెక్ పడినట్లు అయ్యింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss