iDreamPost
android-app
ios-app

గ్రాండ్ గా బిగ్ బాస్ కీర్తి ఎంగేజ్మెంట్! పెళ్లికొడుకు ఎవరంటే..

  • Author ajaykrishna Published - 05:36 PM, Mon - 3 July 23
  • Author ajaykrishna Published - 05:36 PM, Mon - 3 July 23
గ్రాండ్ గా బిగ్ బాస్ కీర్తి ఎంగేజ్మెంట్! పెళ్లికొడుకు ఎవరంటే..

సెలబ్రిటీలు ఎవరైనా గుడ్ న్యూస్ చెప్పారంటే అందరికంటే ముందు ఫ్యాన్స్ లో కలిగే ఆనందం వేరు. ఎందుకంటే.. సెలబ్రిటీలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎప్పుడూ సపోర్ట్ చేసేది అభిమానులే. అలాంటి ఫ్యాన్స్ తమ అభిమాన సెలబ్రిటీకి సంబంధించి గుడ్ న్యూస్ తెలిస్తే ఊరుకుంటారా! ప్రస్తుతం తెలుగు బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తి భట్.. విషయంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం ఫ్యామిలీ లేకుండా ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న కీర్తి.. త్వరలోనే మూడు ముళ్ళు వేయించుకొని ఓ ఇంటికి కోడలు కాబోతుంది. అవును.. ఈ విషయాన్ని తనకు కాబోయే భర్తతోనే ఓ టీవీ షోలో ప్రకటించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో ‘బోనాల జాతర’ అనే ప్రోగ్రాం ప్రసారమైంది. ఈ ప్రోగ్రాంలో బిగ్ బాస్ కీర్తి తనకు కాబోయే భర్తతో.. కెమెరా ముఖంగా ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంది. సీరియల్ హీరోయిన్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కీర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కన్నడ అమ్మాయి అయినప్పటికీ.. కొన్నాళ్ళుగా తెలుగు సీరియల్స్ చేస్తూ ఇక్కడే సెటిల్ అయిపోయింది. నటిగా బిజీ అవుతూ.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే.. ఇప్పుడు కీర్తి పెళ్లి చేసుకొని లైఫ్ లో మరో ముందడుగు వేయడానికి రెడీ అయిపోయింది.

ఇక బోనాల జాతర ప్రోగ్రాంలో కాబోయే భర్తతో పాటు అత్తమామలను సైతం పరిచయం చేసింది కీర్తి. అలాగే తనకు కాబోయే భర్తకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని, పేరెంట్స్ లేని తను.. అతని అత్తమామలను పేరెంట్స్ గా చూసుకుంటానని మాటిస్తూ ఎమోషనల్ అయింది. ఇంతకీ కీర్తికి కాబోయే భర్త ఎవరంటే.. అతని పేరు విజయ్ కార్తీక్. సొంతూరు మదనపల్లి. చిత్తూరులోనే పుట్టిపెరిగిన కార్తీక్.. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. కన్నడ సినిమాలతో పాటు తెలుగులో ఏబి పాజిటివ్, చెడ్డిగ్యాంగ్ లాంటి సినిమాలలో నటించాడు. ప్రెజెంట్ హీరోగా, డైరెక్టర్ గా సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కార్తీక్ కూడా కీర్తిని బాగా చూసుకుంటానని చెప్పి ఆమెను ప్రేమగా ఎత్తుకున్నాడు. అనంతరం ఇద్దరూ పూల దండలు మార్చుకున్నారు. ప్రస్తుతం కీర్తి – కార్తీక్ ల ఎంగేజ్మెంట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి కీర్తి, కార్తీక్ ల జంట గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss