iDreamPost
android-app
ios-app

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ప్రముఖ నటిపై నటుడు అత్యాచారం!

  • Author Soma Sekhar Published - 10:08 PM, Fri - 1 September 23
  • Author Soma Sekhar Published - 10:08 PM, Fri - 1 September 23
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ప్రముఖ నటిపై నటుడు అత్యాచారం!

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ నటుడు.. తన సహనటిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో.. తన ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని ఆ నటికి హామీ ఇచ్చాడ సదరు నటుడు. కానీ అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా.. మరోసారి ఆ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ నటుడిపై నటి చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రియాన్ష్ సింగ్.. ప్రముఖ భోజ్ పూరి యాక్టర్. ప్రస్తుతం ఈమె పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఆమె చేసిన సంచలన ఆరోపణలే. తన సహనటుడు అయిన పునీత్ సింగ్ తనను అత్యాచారం చేశాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని గత నెల 29న పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ..”నా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా పునీత్ సింగ్ రాజ్ పుత్ ను కలిశాను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇండస్ట్రీకి రావాలన్నది అతడి కోరిక.. దాంతో నాకున్న పరిచయాల ద్వారా అతడికి సాయం చేశాను. ఈ క్రమంలోనే మా స్నేహం బలపడటంతో.. అతడు నన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పేవాడు. ఆ తర్వాత మా ఇంటికి రావడం ప్రారంభించాడు. అయితే ఓ రోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మద్యం తాగి వచ్చి నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు. నా జుట్టు పట్టుకుని కొట్టాడు” అంటూ ప్రియాన్ష్ చెప్పుకొచ్చింది.

కాగా.. ఆ మరుసటి రోజు ఉదయం అతడు స్పృహలోకి వచ్చాక.. పోలీసులకు కంప్లైట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చానని ఆమె పేర్కొంది. అయితే పునీత్ సింగ్ ఏడ్చి క్షమించమని వేడుకున్నాడని ఆమె తెలిపింది. త్వరలోనే తన కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు పునీత్ సింగ్. అతడి మాటలు నమ్మ మరోసారి మోసపోయింది ప్రియాన్ష్. అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా.. ఇటీవల మరోసారి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అతడికి వీలైనంత త్వరగా శిక్ష విధించాలని పోలీసులను కోరింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet